/rtv/media/media_files/2025/04/30/IN11yYRdFvu5lCh7Nolo.jpg)
Ice Cubes
Ice Cubes: వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి వల్ల ప్రజలు తమ శరీరాన్ని శీతల పరచుకునే పానీయాలను తాగుతారు. కొందరు ఉష్ణోగ్రత నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఐస్ నమలడం అలవాటు చేసుకుంటారు. ఇది కొంతకాలం పొడి నోటి నుంచి ఉపశమనం అందిస్తుంటుంది. శరీరానికి హైడ్రేషన్ కూడా కలిపిస్తుంది. కానీ తరచుగా ఐస్ తినాలని అనిపించడం ఒక నిర్దిష్ట అనారోగ్యానికి సంకేతం కావచ్చు. ఈ పరిస్థితిని వైద్య భాషలో పగోఫాగియా అంటారు. ఇది PICA అనే అరుదైన తినే రుగ్మతలో ఒక భాగం. ఈ పరిస్థితి గర్భిణీ స్త్రీలు, పిల్లలను ప్రభావితం చేస్తుంది. పగోఫాగియా ఆధ్యాయం ప్రకారం.. ఇది సాధారణంగా ఐరన్ లోపం అనీమియా లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే అది మరింత తీవ్రతరం కావచ్చు.
శరీరానికి నీటి కొరత తగ్గించినా..
కొన్ని పరిస్థితుల్లో ఐస్ తినాలనే కోరిక ఒత్తిడి, ఆందోళన లేదా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) వంటి మానసిక వ్యాధులతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఐస్ ముక్కలు తినడం శరీరానికి నీటి కొరత తగ్గించినా కానీ దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. సాధారణంగా వేసవి కాలంలో ఐస్ నమలడం శరీరానికి హానికరమైనది కాదు. కానీ ఐస్ ఎక్కువగా తినడం దంతాల ఎనామిల్ దెబ్బతినడానికి, జీర్ణక్రియపై ప్రభావం చూపడానికి కారణమవుతుంది. ఎక్కువ ఐస్ తినడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఉదాహరణకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, దంత ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం.
ఇది కూడా చదవండి: పీరియడ్స్ ఫ్లూ అంటే ఏంటి..దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
ముఖ్యంగా ఈ సమస్యలు చాలాసార్లు రక్తహీనత వల్ల కలుగుతాయి. కొందరు టాబ్లెట్స్ తీసుకోకుండా వదిలేస్తే రక్తహీనత సంబంధిత సమస్యలు వస్తాయి. పగోఫాగియాతో సంబంధం ఉన్న కోరికలను గుర్తించడానికి వైద్యులు శారీరక పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ద్వారా రక్తహీనత లేదా మానసిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తారు. చక్కటి ఆరోగ్యం కోసం విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం ముఖ్యం. మానసిక ఆరోగ్య సమస్యల వల్ల ఐస్ తినాలన్న కోరికలు ఉంటే సైకోథెరపీ లేదా CBT (కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ) ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు, పిల్లలు లేదా ఎవరైనా ఐస్ ఎక్కువగా తినాలని అనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడం అత్యంత ముఖ్యం.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మార్కెట్‌లోకి నకిలీ ORS..అందుకే ఇంట్లోనే తయారుచేసుకోండి
( ice-cubes | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )