/rtv/media/media_files/2025/08/23/ice-cream-with-gulab-jamun-2025-08-23-17-26-03.jpg)
Ice cream with gulab jamun
సాధారణంగా భోజనం తర్వాత చాలా మంది జ్యూస్, ఐస్ క్రీమ్(natural-ice-creams), స్వీట్స్ వంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. ఇందులో కొందరికి కొన్ని కాంబినేషన్స్‌లో ఫుడ్ తినాలంటే చెప్పలేనంత ఇష్టం. అందులో అందరూ ఎక్కువగా తినాలనుకునేది ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్(gulab-jamun). ఈ రెండింటిలో చక్కెర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల టేస్టీగా ఉంటుందని చాలా మంది అతిగా తింటుంటారు. వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా తింటారు. అయితే ఈ రెండింటి కాంబినేషన్‌లో తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Health Tips: మారుతున్న వాతావరణంలో రోగాలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోండి!!
మధుమేహం
గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ రెండింటిలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గులాబ్ జామ్‌లు పాకంలో ఉంటాయి. ఐస్ క్రీమ్‌ను తయారు చేసేటప్పుడు పంచదార కలుపుతారు. సాధారణంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటిది రెండింటిని కలిపి తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వీటిని విడివిడిగా కానీ, కలిపి కానీ అతిగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బరువు పెరగడం
గులాబ్ జామ్, ఐస్ క్రీమ్‌లో అధిక మోతాదులో కేలరీలు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల బరువు ఎక్కువగా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్వీట్ తింటే బాడీలో కొవ్వు పెరుగుతుంది. అదే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అదనపు కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణ సమస్యలు
కొందరు భోజనం చేసిన వెంటనే వీటిని తీసుకుంటారు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే గులాబ్ జామ్, ఐస్ క్రీమ్ వంటి పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు
ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. అధిక మొత్తంలో షుగర్ ఉంటుంది. దీనివల్ల గుండె సమస్యలు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Work Stress: ఓవర్ టైం వర్క్‌తో ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలో తెలియటం లేదా..? ఈ చిట్కాలతో పని ఒత్తిడి పరార్!!