/rtv/media/media_files/2025/02/16/U5ZrTEfIZ4MF1wBs7FAy.jpg)
cm revanth reddy participated in the book launch programme
గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారని ఇప్పుడు ఏసీ రూముల్లో నుంచి బయటకు రావడం లేదని సీఎం రేవంత్ అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమైర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బేగంపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: రేయ్ ఎవర్రా మీరంతా..! బర్డ్‌ఫ్లూ భయమే లేదు: ఊరంతా చికెన్ పండగే!
''గోపాలకృష్ణ గారి అనుభవాలను ఈ పుస్తకంలో నిక్షిప్తం చేయడం సంతోషం. ఆరు దశాబ్దాల తన అనుభవాన్ని నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్. ఏదైనా కొనవచ్చు కానీ అనుభవాన్ని కొనలేం. సివిల్ సర్వెంట్స్ అందరికీ ఈ పుస్తకం ఒక దిక్సూచిగా ఉంటుందని భావిస్తున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశంలో వేగంగా జరిగిన మార్పులకు ఆయన ప్రత్యక్ష సాక్షి. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను మనం గుర్తు చేసుకోవాలి శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్
నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి శేషన్ గారు. ఇక దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. వారి అనుభవాల నుంచి సివిల్ సర్వెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. గతంలో అధికారులు రాజకీయ నాయకులు అంశాలను ప్రస్తావిస్తే అందులోని లోతుపాతులు, లాభ నష్టాలను వివరించేవారు. కానీ ఈ రోజుల్లో ఎందుకో అది తగ్గిపోయింది.
Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు
రాజకీయ నిర్ణయాలపై నాయకులకు అధికారులు విశ్లేషణ చేసి చెప్పాలి. గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారు. రాజకీయ నాయకుల కంటే ప్రజలు అధికారులను ఎక్కువ గుర్తుంచుకునేవారు. కానీ ఇప్పుడు కలెక్టర్లు ఏసీ రూముల్లోనుంచే బయటకు వెళ్లడం లేదు. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. పేదలకు సాయం చేయాలన్న ఆలోచన అధికారులకు రావాలి. అలాంటి వారే ప్రజల మనసులో ఎక్కువకాలం గుర్తుంటారని'' సీఎం రేవంత్ అన్నారు.