Bhutan King In Prayagraj: కుంభమేళాలో భూటాన్ దేశ రాజు గంగా హారతి పూజ

కుంభమేళా ఉత్సవానికి భూటాన్ రాజు హాజరైయ్యారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ మంగళవారం ప్రయాగ్‌రాజ్ సంగమంలో స్నానమాచరించారు. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్‌తో కలిసి భూటాన్ రాజు గంగా హారతి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

New Update
King of Bhutan

King of Bhutan Photograph: (King of Bhutan)

Bhutan King In Prayagraj: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Maha Kumbh) ఉత్సవం జరగుతుంది. ఈ కార్యక్రమానికి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ హాజరైయ్యారు. ఆయన సోమవారమే ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో జగ్మే ఖేసర్‌కు సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) స్వాగతం పలికారు. తర్వాత మంగళవారం భూటాన్ రాజు కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో కలిసి గంగాహారతి, పూజా కార్యక్రమంలో పాల్గొ్న్నారు. భూటాన్, భారత్‌కు మధ్య మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి.

Also Read: బీసీ జనాభా తగ్గలే.. పెరిగింది.. ఇదిగో ప్రూఫ్.. సభలో రేవంత్ సంచలనం!

ఏర్పాట్లు కట్టుదిట్టం..

ప్రస్తుతం ఆదేశ రాజు  జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ భారత్ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంకా మెరుగుపడేందుకు దోహదపడతాయి. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి హిందువులు, సాదువులు, ఆధ్యాత్మిక స్నానం ఆచరించడానికి తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటతో అప్రమత్తమై ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేసింది. నిరంతరం అధికారుల పర్యవేక్షణ, ఎలాంటి అవాంచనీయ ఘటన చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాటు చేశారు.

Also Read: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే

Also Read:  వందల కోట్ల విలువైన 30 లగ్జరీ కార్లు.. ఎందుకు సీజ్ చేశారో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు