/rtv/media/media_files/2025/11/09/dirty-plastic-bucket-2025-11-09-08-42-00.jpg)
dirty plastic bucket
బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉన్నా.. బకెట్లు(bathroom-buckets), మగ్గులు లేదా స్టూల్ పసుపు రంగులోకి మారి లేదా మురికిగా కనిపిస్తే.. మొత్తం బాత్‌రూమ్ అపరిశుభ్రంగా కనిపిస్తుంది. మనం తరచుగా బాత్‌రూమ్ టైల్స్, ఫ్లోర్‌ను శుభ్రం చేయడంపై దృష్టి పెడతాము కానీ.. బకెట్లు, మగ్గులను పట్టించుకోము. క్రమంగా నీటి నిల్వలు (water deposits), సబ్బు మరకలు, మురికి పేరుకుపోయి బకెట్‌ను పసుపు రంగులోకి మారుస్తాయి. ఈ మరకలు చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా.. వాటిని అలాగే వదిలేస్తే తొలగించడం కష్టమయ్యే శాశ్వత మరకలుగా మారతాయి. బాత్‌రూమ్‌లోని బకెట్లు, మగ్గులను శుభ్రం చేయాలనుకుంటే.. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు సహాయపడతాయి. వీటితోపాత పసుపు రంగు బకెట్లు కేవలం కొద్ది నిమిషాల్లోనే కొత్తవాటిలా మెరిసిపోతాయి. ఆ చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మురికి పట్టిన ప్లాస్టిక్ బకెట్‌ను శుభ్రం కోసం..
నిమ్మకాయ- ఈనో (Eno) ప్యాకెట్: ఈనో ప్యాకెట్ ఉపయోగించి బకెట్‌ను కొత్తదానిలా మెరిపించవచ్చు. ఒక బకెట్‌లోకి ఒక ప్యాకెట్ ఈనో వేయాలి. అందులో ఒక నిమ్మకాయ రసాన్ని పిండండి.. కొద్దిగా డిటర్జెంట్ లేదా లిక్విడ్ సోప్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో బకెట్, మగ్‌కు పూర్తిగా అప్లై చేసి.. 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సున్నితంగా రుద్ది.. నీటితో కడగాలి. ఇది పాత మరకలను తొలగించి.. బకెట్‌ను కొత్తదానిలా మెరిసేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి: నోరు పొడిబారుతుందా..? కారణం అయితే ఇదే.. మరి ఉపశమనం ఎలానో తెలుసా!!
బాత్‌రూమ్ క్లీనర్: బాత్‌రూమ్ క్లీనర్ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉండే వస్తువు. ఈ క్లీనర్లను టైల్స్, ఫ్లోర్స్‌కే కాకుండా బకెట్లు, మగ్గులకు కూడా ఉపయోగించవచ్చు. మురికిగా ఉన్న బకెట్ లేదా స్టూల్‌పై క్లీనర్‌ను అప్లై చేసి.. 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత బ్రష్ లేదా స్క్రబ్బర్‌తో రుద్ది నీటితో కడగాలి.
బేకింగ్ సోడా-వెనిగర్:మురికి బకెట్లను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా- వెనిగర్ ఉపయోగించడం చాలా ప్రయోజనకరం. అర కప్పు వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను బకెట్, మగ్గు లేదా స్టూల్‌కు అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది నీటితో కడగాలి. ఇది మరకలను తొలగించడమే కాకుండా.. దుర్వాసనను కూడా పోగొడుతుంది.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: ఈ 4 చిట్కాలు.. చీమలు ఇంట్లో నుంచి పరారు
Follow Us