Raw Milk Dark Spots: పచ్చి పాలతో చర్మం మెరుస్తుంది.. నల్లటి మచ్చలు మాయమవుతాయి

పాలలోని సహజ ఎంజైమ్‌లు చర్మాన్ని శుభ్రపరిచి.. ప్రకాశవంతంగా మారుస్తాయి. దూదిని పచ్చి పాలలో ముంచి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. అలానే రెండు టీస్పూన్ల పాలలో చిటికెడు పసుపు కలిపి అప్లై చేస్తే మొటిమలతో పాటు మచ్చలు తగ్గుతాయి.

New Update
Raw Milk Dark Spots

Raw Milk Dark Spots

Raw Milk Dark Spots: ప్రతీ ఒకరు ముఖ సౌందర్యం పట్ల శ్రద్ధ చూపుతారు. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రధాన కారణాలలో ఒకటిగా చెబుతారు. అయితే ముఖంపై నల్లటి మచ్చలు ఉంటే చర్మం ముదురుగా అలసినట్టు కనిపిస్తుంది. ఇవి వయసు హార్మోన్ల అసమతుల్యత సూర్యకిరణాలు, మొటిమల అనంతరంగా ఏర్పడతాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న రకరకాల క్రీములు.. సీరమ్‌లు తరచూ తాత్కాలిక ఫలితాలను ఇస్తున్నా.. వాటిలో ఉన్న రసాయనాలు చర్మాన్ని ఇంకా హాని చేయవచ్చు. అందువల్ల సహజ నివారణలవైపు దృష్టి పెట్టడం అవసరమని చర్మ నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిష్కారాలలో పచ్చి పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీని ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ముఖంపై నల్ల మచ్చలు తగ్గాలంటే...

పచ్చి పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి. ముఖ్యంగా లాక్టిక్ యాసిడ్ చర్మంపై పొర నుంచి చనిపోయిన కణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని వలన ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు క్రమంగా తగ్గుతాయి. అలాగే పాలలో ఉండే విటమిన్ ఎ, డి, ఇ వంటి పోషకాలు చర్మాన్ని లోతుగా తేమనిచ్చి.. ఆరోగ్యంగా మెరుస్తూ ఉండేలా చేస్తాయి. పచ్చి పాలు సహజ క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. ఇది పొడి, గరుకుగా మారిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. రోజువారీగా పాలు ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగవుతుంది. ముఖ్యంగా సూర్యకిరణాల ప్రభావం వల్ల ఏర్పడే టానింగ్‌ను తగ్గించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

ఇది కూడా చదవండి: కాలిన గాయాలపై టూత్‌పేస్ట్ రాస్తున్నారా..? డాక్టర్ చెప్పే విషయాలు తెలుసుకోండి

పాలలోని సహజ ఎంజైమ్‌లు చర్మాన్ని శుభ్రపరిచి.. ప్రకాశవంతంగా మారుస్తాయి. దీనిని దూదిని పచ్చి పాలలో ముంచి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. అలానే పాలలో చిటికెడు పసుపు కలిపి అప్లై చేస్తే మొటిమలతో పాటు మచ్చలు కూడా తగ్గుతాయి. ఇంకొక సహజ పాక్‌గా  పాలు, శనగపిండి కలిపి పేస్ట్ తయారు చేసి ముఖానికి అప్లై చేస్తే.. అది మచ్చలను తేలికపరచడమే కాకుండా చర్మాన్ని టోన్ చేయడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతులు ఎలాంటి రసాయనాలు లేకుండా చర్మానికి సురక్షితంగా పని చేస్తాయి. కనుక ముఖంపై నల్లటి మచ్చలు ఉంటే ఆరోగ్యకరమైన ప్రకాశవంతమైన చర్మాన్ని పొందాలనుకుంటే.. పచ్చి పాలను రొటీన్‌లో భాగం చేసుకోవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో చర్మానికి ఎక్కువ లాభం ఇచ్చే సహజ చికిత్సగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: డయాబెటిస్ రోగులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా..? తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు

dark-spots | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news)

Advertisment
తాజా కథనాలు