/rtv/media/media_files/2025/10/22/caraway-juice-2025-10-22-16-49-18.jpg)
caraway juice
ఈ రోజుల్లో అధిక రక్త చక్కెర ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది అనేక ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. డయాబెటిస్ రోగులకు చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా కీలకం. ఈ విషయంలో కొన్ని మూలికా పానీయాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి గ్లూకోజ్ శోషణను తగ్గించడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ మూడు ఆరోగ్యకరమైన పానీయాలను దినచర్యలో చేర్చుకోవడం ద్వారా చక్కెర స్థాయిలను సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ పానీయాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. అధిక రక్త చక్కెర అదుపులో 3 పానీయాలు డైట్‌లో ఎలా చేర్చుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
అధిక రక్త చక్కెర అదుపు చేసే పానియాలు:
మెంతుల నీరు: శరీరంలో పెరుగుతున్న చక్కెర స్థాయిలను నిర్వహించడానికి మెంతుల నీరు అద్భుతమైన నివారణ. డయాబెటిక్ రోగులకే కాకుండా.. ప్రీ-డయాబెటిక్ వారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. మెంతులు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి, భోజనం తర్వాత చక్కెర శోషణను నెమ్మదిస్తాయి. తద్వారా రక్త చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. దీనికోసం ఒకటి, రెండు టీస్పూన్ల మెంతులను రాత్రిపూట నానబెట్టండి. ఉదయం ఆ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి.
కాకరకాయ రసం: కాకరకాయ ఎంత చేదుగా ఉంటే.. అది శరీరానికి అంత ఆరోగ్యకరం. ఇందులో ఉండే యాంటీ-డయాబెటిక్ గుణాలు మధుమేహానికి ఔషధంలా పనిచేస్తాయి. కాకరకాయలో ఉండే చరాంటిన్, పాలిపెప్టైడ్-పి అనేవి ఇన్సులిన్ మాదిరిగానే పనిచేసి.. శరీరం గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. కాకరకాయను చిన్న ముక్కలుగా చేసి.. నీటితో కలిపి మిక్సీలో బ్లెండ్ చేయాలి. రుచి కోసం కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వడకట్టి పరగడుపున తాగాలి.
ఇది కూడా చదవండి: అందమైన మెరిసే చర్మం కోసం అచ్చంగా 6 చిట్కాలు
దాల్చిన చెక్క టీ: దాల్చిన చెక్క టీ తాగడం వలన భోజనం తర్వాత చక్కెర స్థాయిలలో వచ్చే పెరుగుదల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కలోని సిన్నమాల్డిహైడ్ అనే పదార్థం ఇన్సులిన్ మాదిరిగానే పనిచేసి.. శరీర చక్కెర నియంత్రణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని కోసం ఒకటి లేదా రెండు దాల్చిన చెక్క ముక్కలను మరిగే నీటిలో వేసి నానబెట్టండి. కొన్ని నిమిషాల తర్వాత వడకట్టి కప్పులో పోసి తాగండి. చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి భోజనం తర్వాత దీనిని తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: గీజర్ శుభ్రం చేయడం ఎలానో తెలుసా..?