Brain Stroke: ఆ లక్షణాలు కనిపిస్తే మీకు మూడినట్లే.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ఏం జరుగుతుందో తెలుసా..?

ఆధునిక జీవనశైలి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ వేగంగా పెరుగుతోంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరంలో ముఖం వంకరగా మారడం, చేతులు, కాళ్ళలో బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది, దృష్టి లోపం, తీవ్రమైన తలనొప్పి, సమతుల్యత కోల్పోవడం వంటి సంకేతాలు కనిపిస్తాయి.

New Update
Brain Stroke

Brain Stroke

బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడుకు రక్తం సరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు సంభవించే తీవ్రమైన వైద్య పరిస్థితి. ఈ ఆటంకం వల్ల మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందక అవి చనిపోవడం మొదలవుతాయి. స్ట్రోక్‌ను తెలుగులో పక్షవాతం అని అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు, వైకల్యానికి ప్రధాన కారణాలలో ఒకటి. స్ట్రోక్ సంభవించినప్పుడు.. తక్షణ వైద్య సహాయం చాలా అవసరం. వీలైనంత త్వరగా చికిత్స అందిస్తే మెదడు దెబ్బతినకుండా కొంతవరకు నివారించవచ్చు. స్ట్రోక్‌ను నివారించడానికి.. దాని లక్షణాలను గుర్తించడం, సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక జీవనశైలి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. భారతదేశంలో కూడా ఇది వేగంగా విస్తరిస్తోంది. పక్షవాతం అని పిలువబడే ఈ పరిస్థితిలో.. మెదడులోని రక్త నాళాలు అడ్డుకోవడం లేదా పగిలిపోవడం వల్ల మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది. దీంతో ఆక్సిజన్, పోషకాలు అందక మెదడు కణాలు చనిపోతాయి.

స్ట్రోక్‌కు ముందు కనిపించే కొన్ని ముఖ్య లక్షణాలు:

ముఖం వంకరగా మారడం: హఠాత్తుగా ముఖంలో ఒక భాగం వంకరగా మారడం లేదా నవ్వడానికి ఇబ్బంది పడటం స్ట్రోక్‌కు మొదటి సంకేతం కావచ్చు.
చేతులు, కాళ్ళలో బలహీనత: ముఖ్యంగా శరీరంలో ఒక వైపు చేతులు లేదా కాళ్ళు తిమ్మిరిగా మారి బలం కోల్పోతే.. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
మాట్లాడటంలో ఇబ్బంది: వ్యక్తి హఠాత్తుగా స్పష్టంగా మాట్లాడలేకపోవడం, స్వరం అసంబద్ధంగా మారడం లేదా మాటలు సరిగ్గా రాకపోవడం స్ట్రోక్‌కు సూచన కావచ్చు.
దృష్టిలోపం: కళ్ళ ముందు అకస్మాత్తుగా మసకబారడం లేదా స్పష్టంగా కనిపించకపోవడం కూడా స్ట్రోక్ యొక్క ప్రారంభ లక్షణం.
తీవ్రమైన తలనొప్పి: ఎటువంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా భరించలేనంత తలనొప్పి రావడం కూడా బ్రెయిన్ స్ట్రోక్ సంకేతం.
సమతుల్యత కోల్పోవడం: నడవడంలో ఇబ్బంది పడటం, తరచుగా తల తిరగడం, లేదా సమతుల్యత కోల్పోవడం కూడా ప్రమాద సంకేతం.

ఇది కూడా చదవండి: పెర్ఫ్యూమ్ గుబాళింపులు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసా!!

సమయమే మెదడు అనేది బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలో ఒక ముఖ్యమైన సూత్రం. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే.. అంత ఎక్కువ మెదడు కణాలను కాపాడుకోవచ్చు. పైన పేర్కొన్న లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళాలి. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి, పొగత్రాగడం, మద్యం సేవించడం మానుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలి, మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్ హఠాత్తుగా ప్రాణాంతకం కావచ్చు. ముఖం వంకరగా మారడం, మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు, కాళ్ళలో బలహీనత వంటి లక్షణాలు ఉంటే  వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అరటిపండుతో జుట్టు మెరిసేలా అవుతుందని తెలుసా!! అదెలానో ఇప్పుడే చదవండి

Advertisment
తాజా కథనాలు