/rtv/media/media_files/2025/10/22/brain-cancer-2025-10-22-14-56-57.jpg)
brain cancer
నేటి కాలంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో మెదడు క్యాన్సర్ ఒకటి. తలనొప్పి అనేది సర్వసాధారణమైన సమస్య అయినప్పటికీ.. కొన్ని రకాల నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. మెదడు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు తరచుగా సాధారణ తలనొప్పిని పోలి ఉంటాయి. అందుకే చాలా మంది వాటిని తేలికగా తీసుకుంటారు. అయితే నొప్పి తీవ్రత, నమూనా, తోడు లక్షణాలలో తేడా ఉంటుంది. సాధారణ తలనొప్పి విశ్రాంతి, మందులతో తగ్గుతుంది. కానీ నొప్పి పదేపదే వచ్చి కాలక్రమేణా తీవ్రమవుతుంటే అది ప్రమాదకర సంకేతం కావచ్చు. ఇటువంటి నొప్పి తరచుగా వాంతులు లేదా వికారంతో కూడి ఉంటుంది. మందులతో ఉపశమనం పొందదు. అయితే మెదడు క్యాన్సర్‌కు సంబంధించి సాధారణ తలనొప్పి అనుకోవద్దు.. దాని లక్షణాలను ఎలా గమనించాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తలనొప్పి సాధారణం అనుకోవద్దు..
మెదడులోని దృష్టి నరం లేదా దృష్టిని ప్రాసెస్ చేసే ప్రాంతంపై ఒత్తిడి పడితే కంటి చూపు ప్రభావితం కావచ్చు. మసకబారిన దృష్టి, డబుల్ విజన్ వంటి లక్షణాలు కనిపించవచ్చు. పెద్దవారిలో మొదటిసారిగా మూర్ఛ రావడం చాలా తీవ్రమైన సంకేతంగా పరిగణించాలి. కణితులు మెదడు పనితీరును అడ్డుకోవడం వల్ల శరీరంలో ఒక భాగంలో వణుకు, మూర్ఛలు లేదా కొద్దిసేపు మాట్లాడటంలో ఇబ్బంది వంటివి సంభవించవచ్చు. క్యాన్సర్ మెదడులోని ముందు భాగంలో ఉంటే.. అది మానసిక సామర్థ్యాలు. ప్రవర్తనను ప్రభావితం చేయవచ్చు. అయితే చిరాకు, తరచుగా మతిమరుపు, ఆందోళన లేదా నిర్ణయం తీసుకోవడంలో కష్టం వంటి మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: రాత్రి ఆలస్యంగా తినొద్దు.. అనారోగ్యం బారిన పడొద్దు.. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి!!
శరీర సమతుల్యత దెబ్బతినడం మరొక లక్షణం. మెదడులోని చలనాన్ని నియంత్రించే భాగంపై ఒత్తిడి పడితే.. తరచుగా తడబడటం, కాలు లేదా చేయి బలహీనపడటం లేదా నడవడంలో ఇబ్బంది వంటివి కలగవచ్చు. ఈ లక్షణాలు శరీరంలో ఒక వైపున మాత్రమే కనిపిస్తే.. అది కణితికి సంకేతం కావచ్చు. చాలా తలనొప్పులు తాత్కాలికమే అయినప్పటికీ.. నొప్పి అసాధారణంగా ఉండి.. తిరిగి వస్తూ ఇతర లక్షణాలతో కూడి ఉంటే అశ్రద్ధ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొందరగా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. ప్రారంభంలో గుర్తించడం వల్ల చికిత్స సులభతరం అవుతుందని అంటున్నారు. ఫలితాలు మెరుగ్గా ఉండి ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చెమట కంపు కొండుతుందా.. అయితే ఈ రోగాలున్నాయేమో చెక్ చేసుకోండి!!