/rtv/media/media_files/2025/10/12/larynx-2025-10-12-09-21-18.jpg)
Larynx
నేటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. మన గొంతులో ఉండే చిన్న గొట్టం లాంటి స్వరపేటిక (Larynx) కేవలం మాటలకే కాదు. శ్వాస తీసుకోవడానికి, ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి, శబ్దాలు పుట్టించడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని ప్రాముఖ్యత తెలిసినా.. దీని పట్ల నిర్లక్ష్యం కారణంగా స్వరపేటికకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా లారింజియల్ క్యాన్సర్ (Laryngeal Cancer) కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చే గొంతు నొప్పి, ఇన్‌ఫెక్షన్లు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే కొన్ని లక్షణాలు స్వరపేటిక క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వరపేటిక క్యాన్సర్ లక్షణాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
లారింజియల్ క్యాన్సర్ లక్షణాలు:
నిరంతర గొంతు పొడిబారడం, ఎడతెగని దగ్గు, మాట్లాడటం లేదా మింగడం కష్టంగా మారడం, స్వర తంతువులపై (Vocal Cords) గడ్డ ఏర్పడటం, అధికంగా మద్యం సేవించడం, ధూమపానం, ఒత్తిడి, బిగ్గరగా మాట్లాడటం వంటివి ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. స్వరపేటిక సంరక్షణకు మార్గాలు ఉన్నాయి. స్వరపేటిక వ్యాధులు రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరని వైద్యులు అంటున్నారు. వేయించిన, కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. అతి చల్లటి నీరు తాగడం మానేయాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్!!
అంతేకాకుండా తేనె, అల్లం, తులసి, యష్టిమధు వంటి వాటితో చేసిన కషాయం గొంతు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయానికి నిద్రపోవడం, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడం ముఖ్యం. యోగాలో కపాలభాతి, ఉజ్జయి ప్రాణాయామం, సింహాసనం వంటి ఆసనాలు స్వరపేటిక ఆరోగ్యాన్ని కాపాడతాయి. గొంతు నొప్పిగా ఉన్నా, మాట్లాడటానికి కష్టంగా ఉన్నా గోరు వెచ్చని నీరు తాగడం చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. మనం మాట్లాడటానికి ఆధారమైన స్వరపేటికను జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ముల్లంగి ఆకులు పడేస్తున్నారా..? అయితే ఈ బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాల్సిందే!!