/rtv/media/media_files/2025/09/10/salt-or-sugar-and-oil-2025-09-10-14-25-41.jpg)
Salt or sugar and oil
ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి పెద్ద సవాల్‌గా మారాయి. ముఖ్యంగా భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే చక్కెర, ఉప్పు, నూనెలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ మూడూ శరీరానికి విషంతో సమానమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి విపరీతమైన వినియోగం ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తోందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే చక్కెర, ఉప్పు, నూనెపై నిపుణుల హెచ్చరిస్తున్నారు. ఈ మూడు తెల్ల పదార్థాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చక్కెర (Sugar):
ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఊబకాయం, మధుమేహం ప్రధానమైనవి. దీనికి ప్రధాన కారణం ఆహారంలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా తీసుకోవడమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సుల ప్రకారం.. ఒక వ్యక్తి తీసుకునే మొత్తం కేలరీలలో ఫ్రీ షుగర్ 10% కంటే తక్కువగా ఉండాలి. దీన్ని 5%కి పరిమితం చేస్తే ఇంకా మంచిది. ఓ మనిషి రోజుకు దాదాపు 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోకూడదు. ఫెస్టివల్స్‌లో స్వీట్స్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయని డాక్టర్లు తెలిపారు.
ఉప్పు (Salt):
ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. కానీ అధికంగా తీసుకుంటే కిడ్నీలు, లివర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. WHO, ICMR ప్రకారం.. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవడం ఆరోగ్యకరం. అయితే బ్రెడ్, బిస్కెట్లు, పాపడ్ వంటి ప్యాకేజ్డ్ స్నాక్స్ లోపల దాగి ఉన్న ఉప్పు కారణంగా చాలా మంది ఈ పరిమితిని దాటుతున్నారు. ఉప్పులో ఉండే సోడియం అనేక వ్యాధులకు కారణమవుతుంది. అధిక చెమట పోసే వేసవిలో అర టీస్పూన్ అదనపు ఉప్పు తీసుకోవచ్చని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వంటి వాటిలో ఉండే సోడియం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
నూనె (Oil):
నూనెను వంటలలో విరివిగా ఉపయోగిస్తారు. అయితే.. రోజుకు ఎంత నూనె వాడాలి అనేది ఒక ముఖ్యం. ICMR, FSSAI ప్రకారం.. రోజుకు దాదాపు 6 టీస్పూన్లు నూనెను వాడటం సరైనది. WHO ప్రకారం.. కొవ్వులు, కేలరీలలో 30% కంటే తక్కువ, సంతృప్త కొవ్వులు 10% కంటే తక్కువ, ట్రాన్స్ ఫ్యాట్స్ 1% కంటే తక్కువ ఉండాలి. రైస్ బ్రాన్ ఆయిల్, దేశీ నెయ్యిని రోజుకు రెండు చెంచాలు తీసుకోవాలని సూచించారు. రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఒమేగా-6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉంటాయి. అయితే దీనిని డీప్ ఫ్రై చేయడానికి బదులుగా గార్నిషింగ్, టాపింగ్ కోసం ఉపయోగించాలి. అధిక వేడికి నూనెలు కార్సినోజెనిక్ సమ్మేళనాలుగా మారవచ్చని వైద్యులు హెచ్చరించారు. నిపుణుల సలహాలను పాటించి.. ఈ మూడు పదార్థాలను పరిమితంగా తీసుకోవడం ద్వారా అనేక ఆనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సైలెంట్ హార్ట్ ఎటాక్‌తో జాగ్రత్త..ఈ లక్షణాలు ఉంటే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లే..!!