/rtv/media/media_files/2025/09/18/alarm-2025-09-18-12-49-09.jpg)
alarm
గత కొన్ని సంవత్సరాలుగా గుండెపోటు మరణాలు, గుండె సంబంధిత రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. యువకులు కూడా గుండెపోటు బారిన పడడం ఆందోళన కలిగించే విషయం. దీనికి నిర్దిష్టమైన కారణం లేనప్పటికీ.. ప్రతిసారి అధ్యయనంలో కొత్త కారణం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఉదయం అలారం శబ్దానికి మేల్కొంటే గుండెపోటు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా దీనిపై ఓ అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయన పూర్తి వివరాలలోకి వెళితే... ఉదయం పూట అలారం శబ్దం గుండెపోటు, పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుందని ఓ తాజా అధ్యయనం పేర్కొంది. సహజంగా మేల్కొనడానికి.. బలవంతంగా మేల్కొనడానికి మధ్య రక్తపోటు పెరుగుదల ఉంటుందని తెలిపింది. సహజంగా మేల్కొనే వారితో పోలిస్తే.. అలారం శబ్దానికి మేల్కొనే వారిలో రక్తపోటు 74 శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది.
అలారం శబ్దంతో గుండెపోటు ప్రమాదాలు..
అలారం మోగినప్పుడు.. అది శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఇది కార్టిసాల్, అడ్రినలిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు గుండె వేగంగా కొట్టుకునేలా, రక్తనాళాలు సంకోచించేలా చేస్తాయి. దీనివల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరుగుతుందని వెల్లడైంది. అలారం శబ్దానికి అకస్మాత్తుగా మేల్కొనడం వల్ల స్లీప్ ఇనర్షియా ఏర్పడవచ్చు. దీనివల్ల చాలా సేపు నిస్సత్తువగా, అసంకల్పితంగా అనిపించవచ్చు. తగినంత నిద్ర (7 గంటల కంటే తక్కువ) లేకపోవడం, అలారం వల్ల మేల్కొనడం వల్ల ఉదయం రక్తపోటు, సంబంధిత గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధన సూచిస్తుంది.
ఇది కూడా చదవండి:నడుము నుంచి పాదాల వరకు తీవ్రమైన నొప్పా..? విస్మరిస్తే జీవితాంతం సమస్యలు తప్పవు!!
ఫ్లూట్, వయోలిన్, పియానో వంటి మృదువైన వాయిద్య శబ్దాలను ఉపయోగించాలి. వర్షపు చినుకులు, సున్నితమైన జాజ్, ప్రవహించే ప్రవాహం లేదా నది శబ్దం, సముద్రపు అలలు, పక్షుల కిలకిల శబ్దాలు, వర్షారణ్యం శబ్దాలు, అడవి వాతావరణం వంటి శబ్దాలను అలారాలుగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ శబ్దాలు గుండెకు ఎలాంటి సమస్యలు కలిగించవు. ఈ నివేదికపై మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:చిగుళ్ల నుంచి రక్తస్రావమా..? అయితే గుండెజబ్బు లేక మధుమేహం కావొచ్చు..!!