Blood Group: బ్లడ్ గ్రూప్‌కు తెలివితేటల మధ్య సంబంధం ఉందా..?

పత్రి మనిషిలో బుద్ధి, ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి వంటి మానసిక సామర్థ్యాలు అనేక అంశాలపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. B+, O+ రక్త కలిగిన వ్యక్తులు బలమైన మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారట. వీరు తమ దృష్టిని, సవాళ్లను ఎదుర్కొనడంలో వారు ముందుంటారు.

New Update
intelligence

Intelligence

Blood Group: పత్రి మనిషిలో బుద్ధి, ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి వంటి మానసిక సామర్థ్యాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక ఆసక్తికరమైన పరిశోధనలో రక్త వర్గం కూడా తెలివితేటలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ అధ్యయనంలో 69 మందిపై చేసిన గమనికల ఆధారంగా కొన్ని బ్లడ్ గ్రూపులు కలిగిన వ్యక్తులు ఇతరుల కంటే పదునైన మనస్సు కలిగి ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. B+, O+ రక్త కలిగిన వ్యక్తులు బలమైన మానసిక సామర్థ్యాన్ని ప్రదర్శించారని ఈ అధ్యయనంలో తేలింది.

విషయంపై కేంద్రీకరించడంలో నైపుణ్యం..

ఈ పరిశోధన ప్రకారం.. B+ రక్త వర్గం ఉన్నవారు అధికంగా సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. వారి మెదడులోని పెరిటోనియల్, టెంపోరల్ లోబ్స్ మరింత చురుకుగా పనిచేస్తాయని శాస్త్రీయంగా వెల్లడైంది. ఇది వారి మెదడును బలంగా మార్చి.. వారిని తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను అర్థం చేసుకునేలా చేస్తుంది. అలాగే.. ఈ రక్త వర్గం కలిగిన వ్యక్తులు తమ దృష్టిని ఒకే విషయంపై కేంద్రీకరించడంలో నైపుణ్యం కలిగి ఉండటంతో.. సవాళ్లను ఎదుర్కొనడంలో వారు ముందుంటారు. ఇంకా O+ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు వారి శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందట. మెదడులో ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా జరిగే కారణంగా.. వారి జ్ఞాపకశక్తి పదునుగా ఉంటుంది. ఈ రక్త వర్గం కలిగినవారు కష్టమైన పనులను సైతం చాకచక్యంగా చేయగలగడం, సుదీర్ఘకాలిక దృష్టిని కలిగి ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉంటారని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆ ఎసిడిటీ టాబ్లెట్లతో క్యాన్సర్ ముప్పు.. కేంద్రం షాకింగ్ ప్రకటన!

ఈ పరిశోధనలో పొందిన వివరాలు కొన్ని నిర్దిష్ట బ్లడ్ గ్రూపులపై మాత్రమే దృష్టి సారించడమే తప్ప.. ఇతర రక్త వర్గాల వ్యక్తులు తెలివితేటలలో తగ్గే వారు అన్న ఉద్దేశం కాదు. తెలివితేటలు అనేవి జన్యుపరంగా వచ్చే లక్షణాలతో పాటు.. జీవనశైలి, పరిసరాలు, విద్య, ఆహారం, అనుభవం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి బ్లడ్ గ్రూప్ ఆధారంగా మాత్రమే ఎవరి తెలివిని నిర్ణయించడం సముచితం కాదు. కానీ ఈ పరిశోధన మనలో ఆసక్తి కలిగించేదిగా ఉంది. ఈ అధ్యయనం తెలివితేటలపై బ్లడ్ గ్రూప్ ప్రభావం ఉందనే అంశాన్ని పరిశీలించడానికి ఒక ప్రారంభబిందువుగా ఉపయోగపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: శివునితోపాటు సోమవారం ఏ దేవతలను పూజించాలో తెలుసా..?

( Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News)

Advertisment
తాజా కథనాలు