Bhojan Niyam: ప్లేట్‌లో ఆహారం ఉంచితే ఇలా జరుగుతుంది అంట!!

ఆహార సంబంధిత తప్పులు జాతకంలో బుధ, గురు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు కూడా జరుగుతాయి. ప్లేట్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని ఆవులకు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి తామసిక పదార్థాలు ఉంటే అది మతపరంగా అనుచితంగా చెబుతారు.

New Update
Bhojan Niyam

Bhojan Niyam

సనాతన ధర్మంలో భోజనానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇవి కేవలం తినే పద్ధతులు మాత్రమే కాదు.. అవి ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచిదంటారు. ఈ నియమాలు ఆహారం తీసుకునేటప్పుడు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. భోజనం చేసే సమయం. కూర్చునే దిక్కు, శుచి శుభ్రత, ఆహారాన్ని గౌరవించడం వంటి అంశాలను ఈ నియమాలు తెలియజేస్తాయి. అయితే.. తూర్పు దిక్కున కూర్చుని భోజనం చేయడం, నిలబడి తినకపోవడం, వంట చేసే ముందు స్నానం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ నియమాలు పాటించడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడమే కాకుండా.. ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అనేది ఒక నమ్మకం. ఈ నియమాలు మన సంప్రదాయంలో ఆహారానికి ఉన్న పవిత్రతను తెలియజేస్తాయి. అయితే సనాతన ధర్మంలో అన్నాన్ని అన్నాపూర్ణ తల్లికి సంకేతంగా భావిస్తారు. కానీ కొంతమందికి అలవాటుగా ప్లేట్‌లో భోజనాన్ని వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల వారి జీవితాలపై ఎలాంటి ప్రభావాలు పడతాయో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ విషయాల గురించి కొన్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ప్లేట్‌లో మిగిలిపోయిన ఆహారం ప్రమాదకరం:

పెద్దలు తరచూ చెప్పే మాట నీకు ఎంత కావాలో అంతే తీసుకో.. కానీ కొంతమంది ఈ మాటని పట్టించుకోకుండా.. ఎక్కువగా వడ్డింపించుకొని తినకుండా వదిలేస్తారు. ఇలా ప్లేట్‌లో ఆహారం వదిలివేయడం వల్ల అన్నాపూర్ణ మాతను అవమానించినట్లే అవుతుందని పెద్దలు చెబుతారు. ఈ అలవాటు ఉన్నవారి జీవితంలో సంపద, ఆహారం, ఆనందం, శ్రేయస్సు కొరతగా ఉంటుంది. అయితే ఎంతో కష్టపడినా.. అన్ని విధాలా సక్రమంగా ఉన్నా తమకు ఎందుకు ఇలా జరుగుతుందో వారు గుర్తించలేకపోతారు. అంతేకాకుండా.. ఆహారాన్ని వృథా చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. మీరు ఎంత పూజలు, వ్రతాలు చేసినా సరే ఫలితం ఉండదు. అలాగే పూర్వీకుల ఆశీర్వాదం కూడా లభించదు. శని గ్రహ ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. 

ఇది కూడా చదవండి:  భోజనం తిన్న తర్వాత ఈ ఆకు నమిలితే.. ఏం జరుగుతుందో తెలుసా?

భోజనాన్ని వృథా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలహీనపడతాడు.. దీనివల్ల వ్యక్తి నిత్యం మానసిక ఒత్తిడితో బాధపడతాడు. ఇలాంటి వారికి ఆయుష్షు కూడా తగ్గుతుందని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆహార సంబంధిత తప్పులు కేవలం నిర్లక్ష్యం వల్ల మాత్రమే కాకుండా.. జాతకంలో బుధ మరియు గురు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు కూడా జరుగుతాయి. ప్లేట్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని ఆవులకు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి తామసిక పదార్థాలు ఉంటే అది మతపరంగా అనుచితంగా చెబుతారు. కాబట్టి ఎల్లప్పుడూ అన్నాన్ని గౌరవించి.. అవసరం మేరకే తీసుకోవాలి. ఈ చిన్న విషయం మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. నివారణకు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ నెలలోనే సూర్యగ్రహణం.. డేట్, టైమ్, రాశులపై ప్రభావం.. తదితర వివరాలివే

Advertisment
తాజా కథనాలు