/rtv/media/media_files/2025/04/20/iGdtXjybF9Ln1Q74kp4D.jpg)
Pink Eye
Pink Eye: ఇటీవలి కాలంలో బెంగళూరులో పింక్ ఐ ఇన్ఫెక్షన్ విస్తరిస్తోంది. ఇది చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ప్రభావితం చేస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులే ఈ వ్యాధి పెరగడానికి ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే డెంగ్యూ వంటి వైరల్స్‌తో బాధపడిన ప్రజలు, ఇప్పుడు పింక్ ఐ సమస్యను ఎదుర్కొంటూ మరింత ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాల వయస్సు పిల్లలు ఎక్కువగా బాధపడుతున్నందున తల్లిదండ్రులు వారిని బడికి పంపడంపై కూడా సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధికి గల విస్తరణ వేగాన్ని బట్టి చూస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది.
కంటి లోపల ఎరుపు..
పింక్ ఐ లేదా కంజంక్టివైటిస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. కంటిలోని పారదర్శక పొర కంజంక్టివా ఇన్ఫెక్ట్ కావడంతో కంటి లోపల ఎరుపు పెరిగి, వాపు, దురదగా మారుతుంది. దీనివల్ల నీరు కారడం, మంట, కనురెప్పలు అతుక్కుపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇది అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధిగా గుర్తించబడింది. పాఠశాలలతో పాటు ప్రజలు ఎక్కువగా కంటే కంటికి సంపర్కం కలిగే ప్రదేశాల్లో ఇది సులభంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, వారిలో ఈ ఇన్ఫెక్షన్ త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు కళ్ళు తడిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో ముంచిన గుడ్డతో మృదువుగా ముద్దించాలి. ప్రతి కంటికీ వేరే గుడ్డ వాడాలి.
ఇది కూడా చదవండి: ఈ విషయం తెలిస్తే పేపర్ కప్పులలో అస్సలు టీ తాగరు
ఇన్ఫెక్షన్ సోకిన వారు చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. కళ్ళు తాకిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడగాలి. కొంతకాలం కాంటాక్ట్ లెన్సులు వాడకుండా ఉండాలి. దురద లేదా మంట అనిపించినా కళ్ళను రుద్దకూడదు. అలాగే ఈత కొలనుల్లోకి పోకూడదు ఎందుకంటే నీటిలోని వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉంటుంది. తీవ్రత ఎక్కువైతే వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి. లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, నొప్పి నివారణ మందులు వంటి ప్రాథమిక చికిత్సలు ఉపశమనానికి ఉపయోగపడతాయి. అయితే సెల్ఫ్ మెడికేషన్ చేయకుండా నిపుణుడిని సంప్రదించాలి. ఈ వ్యాధిని తేలికగా తీసుకోకుండా సమయానికి చికిత్స చేయడం ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఏసీ వాడేప్పుడు ఇలా చేస్తే కరెంట్ బిల్లు వందల్లోనే వస్తుంది
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)