Peanuts: ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వేరుశెనగలు తింటే ఏమవుతుంది?

వేరుశనగలో జింక్, మెగ్నీషియం, విటమిన్ E వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది జలుబు, దగ్గు,   ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి వేరుశెనగలో మంచి ఎంపిక. 

New Update
Peanuts

Peanuts

Peanuts: వేరుశనగలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ శక్తి రోజంతా మిమ్మల్ని చురుగ్గా. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వేరుశనగలు బెస్ట్‌ ఆహారం. ఈ సీజన్‌లో ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడటమే కాకుండా.. శరీరానికి వెచ్చదనం, శక్తి కూడా లభిస్తుంది. వేరుశెనగలు ఖాళీ కడుపుతో తినడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉండే సూపర్‌ ఫుడ్. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వేరుశెనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్‌ కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వేరుశెనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

వేరుశనగలో జింక్, మెగ్నీషియం, విటమిన్ E వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది జలుబు, దగ్గు నుంచి రక్షిస్తుంది. వేరుశెనగలో భాస్వరం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఇది మంచి ఎంపిక. వేరుశెనగలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: అంజీర్‌తో పాలు తాగితే ఏమవుతుంది? మంచిదా? చెడ్డదా?

ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. వేరుశెనగలో మంచి ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కొందరిలో చర్మం పొడిబారడం ఒక సాధారణ సమస్య. వేరుశెనగలో ఉండే విటమిన్ ఇ, బయోటిన్ చర్మానికి తేమను అందిస్తాయి. జుట్టును బలంగా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది.. ఈ వ్యాధులను దూరంగా ఉంచుతుంది!

health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు