/rtv/media/media_files/2025/09/22/melatonin-hormone-2025-09-22-20-01-41.jpg)
Melatonin Hormone
నేటి కాలంలో సులభంగా నిద్ర పట్టకపోవడం, మధ్యమధ్యలో మెలకువ రావడం, ఉదయం లేవగానే అలసిపోయినట్లుగా అనిపించడం.. ఈ సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. ఈ పోటీ ప్రపంచంలో ప్రశాంతమైన నిద్ర చాలా అరుదైపోయింది. ఆరోగ్యానికి, మెదడుకు, శరీరానికి అత్యంత ముఖ్యమైనది నిద్ర. కానీ పని ఒత్తిడి, ఆధునిక జీవనశైలి కారణంగా నిద్రలేమి సమస్య పెరిగిపోతుంది. సరైన నిద్ర లేకపోతే శారీరక, మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మెలటోనిన్ దీనిని నిద్ర హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది మెదడులోని పీనియల్ గ్రంథి ద్వారా రాత్రిపూట సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్ర-మేలుకునే చక్రాన్ని (సర్కాడియన్ రిథమ్) నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల చేసిన అధ్యయనాల ప్రకారం.. మెలటోనిన్ కేవలం నిద్రకు మాత్రమే కాకుండా.. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని గుర్తించారు.
ప్రశాంతమైన నిద్రకు మెలటోనిన్..
ఈ అధ్యయనాల ప్రకారం.. సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి (జెట్ లాగ్) మరియు రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారికి మెలటోనిన్ సప్లిమెంట్లు చాలా ఉపయోగపడతాయి. ఇవి నిద్ర నాణ్యతను మెరుగుపరిచి.. నిద్ర అంతరాయాలను తగ్గిస్తాయి. అంతేకాకుండా మెలటోనిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి.. వృద్ధాప్యం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 2020 అధ్యయనం ప్రకారం.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో ఈ ఆహారం తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం
కోవిడ్-19 సమయంలో కూడా మెలటోనిన్‌పై పరిశోధనలు జరిగాయి. ఇది ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి.. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుందని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే.. సప్లిమెంట్ల వల్ల తలనొప్పి, మైకము, పగటిపూట నిద్రమత్తు, మూడ్ స్వింగ్స్ వంటి దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, ఇతర మందులు వాడుతున్నవారు వైద్యుడిని సంప్రదించటం మంచిది. సప్లిమెంట్లకు బదులుగా.. మెలటోనిన్‌ను సహజంగా పెంచుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. రాత్రిపూట గదుల్లో లైట్లు తగ్గించడం, మొబైల్ ఫోన్లు,ల్యాప్‌టాప్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్‌కు దూరంగా ఉండటం, పగటిపూట సూర్యరశ్మిలో గడపడం వంటివి చేయాలి. అలాగే పడుకునే ముందు భారీ భోజనం, కెఫీన్ తీసుకోవడం మానేయాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకునే అలవాటును పాటించడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: గర్భాశయ క్యాన్సర్ రాకుండా టీకా వేయించుకోడానికి ఖర్చు ఎంతో తెలుసా..?