/rtv/media/media_files/2025/09/23/drinking-water-2025-09-23-16-20-47.jpg)
Water
నీరు లేకుండా భూమిపై జీవం మనుగడ సాగించలేదు. నీరు ఒక ద్రవరూప రసాయన సమ్మేళనం. ఇది రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువుతో ఏర్పడుతుంది (H2O). ఇది రంగు, వాసన లేనిది. నీరు భూమి ఉపరితలంలో 71% ఆవరించి ఉంది. అయితే అందులో కేవలం ఒక శాతం మాత్రమే సురక్షితమైన తాగునీరు. మంచు, ద్రవం, వాయువు ఈ మూడు రూపాల్లో ఇది లభ్యమవుతుంది. వాతావరణాన్ని నియంత్రించడంలో.. జీవుల శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయం.. పరిశ్రమలతోపాటు ఆరోగ్యానికి కూడా ఇది చాలా ముఖ్యమైనది. అందుకే రోజూ ఎక్కువ నీరు తాగాలని వైద్యులు చెతున్నారు. కొందరు తక్కువ నీరు తాగుతారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల ఒత్తిడి పెరుగుతుందట. జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీ నివేదిక ప్రకారం.. తగినంత నీరు తాగకపోతే ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. నీరు తక్కువగా తాగడం వల్ల మనకు తెలియకుండానే ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
నీరు తాగడం వల్ల ఒత్తిడి పరార్..
శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను వేగంగా పెంచడం ద్వారా ఇది జరుగుతుంది. కార్టిసాల్ స్థాయిలు పెరగడం వల్ల ఒత్తిడికి శరీర ప్రతిస్పందన కూడా పెరుగుతుందని చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు, మెదడు వాసోప్రెసిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది కిడ్నీలకు నీటిని నిల్వ చేయమని సందేశం పంపుతుంది. అదే సమయంలో.. మెదడులోని హెచ్చరిక వ్యవస్థ సక్రియం అవుతుంది. ఇది శరీరంలో కార్టిసాల్ హార్మోన్ మొత్తాన్ని పెంచుతుంది. ఒత్తిడికి గురైనట్లు గుర్తించిన కార్టిసాల్ హార్మోన్.. మరింత గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలికంగా అధిక కార్టిసాల్ స్థాయిలు గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
ఇది కూడా చదవండి: గర్భాశయ క్యాన్సర్ రాకుండా టీకా వేయించుకోడానికి ఖర్చు ఎంతో తెలుసా..?
శరీరంలో దాదాపు 70% నీరు ఉంటుంది కాబట్టి.. నీరు శరీరంలోని ప్రతి చిన్న మరియు పెద్ద పనితీరుకు అవసరం. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ ఎంత నీరు తాగాలని తెలుసుకోవడం ముఖ్యం. ప్రజా ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం.. మహిళలు రోజుకు 2 లీటర్లు, పురుషులు 2.5 లీటర్ల నీరు తాగాలి. మీకు దాహం వేయకపోతే.. మీరు తగినంత నీరు తాగారని కాదు. పరిశోధనల ప్రకారం.. తక్కువ నీరు తాగే వారికి దాహం వేయదు. అందువల్ల నీరు తాగే అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా ఒత్తిడి రహితంగా ఉండవచ్చు. కాబట్టి ఇప్పటి నుండే నీరు తాగే అలవాట్లపై దృష్టి పెట్టాలి. దీనివల్ల ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులను నివారింవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నిద్ర రావాలంటే ఈ హార్మోన్ సహాయం చేయాల్సిందే