Kidney: తెలంగాణలో డేంజర్ బెల్స్.. ప్రతీ 100 మందిలో ఏడుగురికి కిడ్నీలు ఖరాబ్.. షాకింగ్ రిపోర్ట్!

తెలంగాణ రాష్ట్రంలో మూత్రపిండాల సమస్యల తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్నవారు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. తెలంగాణలో ఈ శాతం ఏకంగా 7.4గా ఉన్నట్లు ఆరోగ్యశ్రీ విడుదల చేసిన గణాంకాల్లో అత్యధిక కేసులు కిడ్నీ సంబంధితవేనని తేలింది.

New Update
Kidney Function

Kidney Function

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక ఉప్పు-చక్కెర వినియోగం, ఊబకాయం వంటి అంశాలు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలో మూత్రపిండాల సమస్యల (Impaired Kidney Function - IKF) తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉంది. మూత్రపిండాల సమస్యలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)-ఇండియాబీ సంయుక్తంగా  అధ్యయనం నిర్వహించారు. దేశంలోనే అత్యధిక కిడ్నీ సమస్యలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ సమస్యతో బాధపడుతున్న ప్రతి వంద మందిలో ఏడుగురు తెలంగాణకు చెందినవారే కావడం గమనార్హం. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 25,408 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. జాతీయ స్థాయిలో సగటున 3.2 శాతం మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. 

కిడ్నీ సమస్యల రాజధానిగా తెలంగాణ..

అయితే తెలంగాణలో ఈ శాతం ఏకంగా 7.4గా నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే 2.3 రెట్లు అధికం. చిన్న రాష్ట్రమైన గోవా కూడా 7.4 శాతంతో తెలంగాణతోపాటు అగ్రస్థానంలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా బిహార్‌లో అత్యల్పంగా 0.8 శాతం మాత్రమే ఈ సమస్య ఉంది. ఇటీవల ఆరోగ్యశ్రీ విడుదల చేసిన గణాంకాల్లో కూడా రాష్ట్రంలో అత్యధిక కేసులు కిడ్నీ సంబంధితవేనని తేలింది. కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలుగా అధిక రక్తపోటు (HBP), మధుమేహం (డయాబెటిస్) ఉన్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది. తెలంగాణలో ఈ రెండు సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య సుమారు 50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఈ కారణంగానే కిడ్నీ సమస్యల ముప్పు పెరుగుతోందని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు లేనివారితో పోలిస్తే.. ఈ రెండు సమస్యలు ఉన్నవారిలో కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఆరు రెట్లు అధికంగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు వారిలో కూడా మధుమేహం, అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. 

ఇది కూడా చదవండి: బాడీ ఫ్యాట్‌తో పరేషాన్ అవుతున్నారా..? ఈ డ్రింక్ మీ ఫ్యాట్ కరిగించి ష్రింక్ చేస్తుంది

కిడ్నీ వ్యాధులను సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే లక్షణాలు కనిపించే సమయానికి కిడ్నీలు 70-80 శాతం వరకు దెబ్బతింటాయి. నొప్పి నివారణ మందులు (Painkillers), గ్యాస్-ఎసిడిటీ మందుల అధిక వాడకం, అలాగే ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి మందుల మిశ్రమ వినియోగం సమస్యను పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలను రక్షించుకోవడానికి 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, సరైన ఆహార నియంత్రణ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమస్య తీవ్రత ఒకే విధంగా ఉండడం, పురుషుల్లో (3.8%) మహిళల (2.6%) కంటే ఎక్కువ ఉండడం ఈ అధ్యయనంలోని మరికొన్ని ముఖ్యాంశాలు.

ఇది కూడా చదవండి: రాత్రి మధ్యలో నిద్ర లేస్తున్నారా..? కారణాలు, పరిష్కారాలు తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు