Brain Stoke: భారీగా పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్!

నేటి కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ధూమపానాలకి దూరంగా ఉండాలి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య తగ్గాలంటే శారీరక శ్రమ పెంచుకుంటూ ఉండాలి.

New Update
Brain Stroke

Brain Stroke

Brain Stroke: నేటి యువతలో మెదడు పోటు (బ్రెయిన్ స్ట్రోక్) కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గతంలో వృద్ధులలో ఎక్కువగా కనిపించిన ఈ సమస్య ఇప్పుడు యువతలో కూడా ఎక్కువవుతోంది. మారిన జీవనశైలి, అధిక ఒత్తిడి, నిద్రలేమి, ధూమపానం, మధుమేహం వంటివి దీనికి ప్రధాన కారణాలు. మెదడుకు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడటం లేదా రక్తనాళాలు పగలడం వల్ల మెదడుపోటు సంభవిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించే కొన్ని ఆహార నియమాలు ఉన్నాయి. వాటిని ఎలా తీసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ప్రధాన కారణాలు:

బ్రెయిన్ స్ట్రోక్ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ముందుగా ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, గుండె జబ్బులు, శారీరక శ్రమ లేకపోవడం, అధిక మద్యపానం, డ్రగ్స్ వాడకం వంటివి తగ్గించాలి. ఇవే నేటి కాలంలో ఎక్కువగా మెదడు పోటుకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నివారణ చర్యలు:

క్రమంతప్పని వైద్య పరీక్షలు: రక్తపోటు, షుగర్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలి.

ఆరోగ్యకరమైన జీవనశైలి: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. నడక, జాగింగ్, యోగా వంటివి మంచివి.

ధూమపానం, మద్యపానానికి దూరం: ఈ అలవాట్లు మెదడు పోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

ఒత్తిడి నియంత్రణ: ధ్యానం, యోగా లేదా అభిరుచులను పెంచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.

తగినంత నిద్ర: రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి.

ఇది కూడా చదవండి: ధూమపానం దూల తీర్చిదట.. క్యాన్సర్‌తోపాటు ప్రాణాంతక వ్యాధులకు స్వాగతం చెప్పినట్లే

ఆహార నియమాలు:

పండ్లు, కూరగాయలు: విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి రక్తపోటును నియంత్రించి, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

తక్కువ కొవ్వు పదార్థాలు: వేయించినవి, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు (అవకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్) మితంగా తీసుకోవచ్చు.

తక్కువ ఉప్పు, చక్కెర: ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక ఉప్పు, చక్కెర ఉన్న పదార్థాలను తగ్గించాలి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం: తృణధాన్యాలు, పప్పులు, చిక్కుళ్ళు వంటివి జీర్ణక్రియకు సహాయపడి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

పుష్కలంగా నీరు: శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. రోజూలో కనీసం 3 లీటర్ల నీరు తాగితే  ఆరోగ్యానికి మంచిది.

మెదడు పోటును నివారించడంలో ఆహారం, జీవనశైలి కీలక పాత్ర పోషిస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదకరమైన పరిస్థితిని నివారించవచ్చు. ఏదైనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వ్యాయామంతో మానసిక ఆరోగ్యం మెరుగు.. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..?

( brain-stroke | symptoms of brain stroke | Health Tips | health tips in telugu | best-health-tips | Latest News )

Advertisment
తాజా కథనాలు