Smoking: ధూమపానం దూల తీర్చిదట.. క్యాన్సర్‌తోపాటు ప్రాణాంతక వ్యాధులకు స్వాగతం చెప్పినట్లే

ధూమపానం అనేది వ్యక్తి జీవితాన్ని నాశనం చేయటంతోపాటు అనేక అవయవాలను నాశనం చేస్తుంది. ధూమపానం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, నోటి, గొంతు క్యాన్సర్, అంగస్తంభన సమస్యలతోపాటు అవయవాల లైనింగ్‌పై ప్రభావం చూపుతుందని WHO నిపుణులు చెబుతున్నారు.

New Update
Smoking

Smoking

Smoking: నేటి కాలంలో అనేక రోగాలు మనుషుల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం జీవనశైలి, జంక్‌ ఫుడ్‌, ఇతర అలవాట్లు అని తెలిసినా వాటిని మార్చుకోరు. రుచి కోసం ఇష్టం వచ్చిన ఆహారాలు తింటారు.  కొన్ని వ్యసనాలు అయితే చెప్పలేం. వాటిల్లో ధూమపానం ఒకటి. ఈ రోజుల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సిగరెట్లు తాగుతున్నారు. దానివల్ల అనేక వ్యాధులు వస్తాయని చెప్పిన ఈ అలవాటును మార్చుకోరు. అయితే సిగరెట్ తాగిన క్యాన్సర్‌ వస్తుందని విషయం మనందరికీ తెలిందే. WHO సర్వే ప్రకారం.. ధూమపానం అనేది వ్యక్తి జీవితాన్ని నాశనం చేయటంతోపాటు అనేక అవయవాలను నాశనం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ ధూమపానం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది  మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది.  సిగరెట్లు తాగడం వల్ల ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయో..? ఊపిరితిత్తుల క్యాన్సర్ నిపుణులు ఏం చెబుతున్నారో.. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

 ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తాయి..

సిగరెట్లు తాగడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వస్తుంది. ఈ ధూమపానం క్యాన్సర్ వంటి నయం చేయలేని వ్యాధులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ రోగం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 7 మిలియన్ల మంది మృతి చెందిస్తున్నారు. అంతేకాదు ఇది శరీరాన్ని అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చేలా చేస్తుంది. పొగాకు, నికోటిన్ ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు చెబుతున్నారు. CDC సర్వే ప్రకారం..  ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణానికి ప్రధాన కారణమటోంది. ధూమపానం చేసేవారికి 15 నుంచి 30 రెట్లు ఎక్కువ ప్రమాదం అవకాశం ఉందట. ఇది శ్వాస తీసుకోవడం కష్టతరం చేసి మరణానికి ప్రధాన కారణమవుతుంది. అంతేకాదు బాల్యంలో ధూమపానం ఊపిరితిత్తుల అభివృద్ధిని నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: రాఖీ పండుగన బహుమతుల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ధూమపానం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, నోటి, గొంతు క్యాన్సర్, అంగస్తంభన సమస్యలతోపాటు అవయవాల లైనింగ్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది హృదయ స్పందన రేటును పెంచి గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. అంతేకాకుండా ధూమపానం వల్ల మెదడుకు రక్త సరఫరాను అడ్డుకుని పక్షవాతం వచ్చేలా చేస్తుంది. ధూమపానం చేసే పురుషులకు బృహద్ధమని సంబంధ అనూరిజం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ అనూరిజమ్స్ రక్త నాళాలను దెబ్బతీస్తాయి కాబట్టి అవి ప్రాణాంతకం కూడా అవుతుంది. ఇది కంటి లెన్స్ అపారదర్శకంగా మారి దృష్టి లోపం సంభవించే ఒక కంటి వ్యాధి. ఇది అంధత్వానికి ప్రధాన కారణం మరియు ధూమపానం వల్ల ఇది వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ధూమపానం ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది వాపు, నొప్పి, వైకల్యం, కీళ్ల కదలికలో ఇబ్బందిని కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో,  ముందు తల్లులు ధూమపానం చేస్తే పిల్లలకు ఎక్కువ ప్రమాదం. తండ్రి కూడా ధూమపానం చేస్తే ప్రమాదం మరింత పెరుగుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: బ్లడ్ గ్రూప్‌కు తెలివితేటల మధ్య సంబంధం ఉందా..?

( Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News )

Advertisment
తాజా కథనాలు