/rtv/media/media_files/2025/09/27/dry-nose-2025-09-27-20-19-44.jpg)
Dry nose
ముక్కు పొడిబారడం అనేది కేవలం శ్వాసకోశ సమస్య మాత్రమే కాదు.. చెవులకు, వినికిడికి ముప్పు కలిగించే ప్రమాద సంకేతం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముక్కు, చెవులు యుస్టేషియన్ ట్యూబ్ (Eustachian Tube) ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఈ ట్యూబ్ ముక్కు, చెవుల మధ్య తేమ, గాలి పీడనం (Pressure) సమతుల్యతను నిర్వహిస్తుంది. ముక్కులో అధిక పొడిబారడం నేరుగా ఈ యుస్టేషియన్ ట్యూబ్‌లను అడ్డుకుంటుంది. దీని వలన మధ్య చెవిలో గాలి సమతుల్యత దెబ్బతిని.. చెవుల్లో నొప్పి లేదా పీడనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముక్కు ఎండిపోవడం వల్ల చెవిటివారైపోవచ్చట. ముక్కు ఎక్కువగా ఎండిపోవడాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పొడి ముక్కుతో చెవుడు వచ్చే ప్రమాదం..
కొన్నిసార్లు చెవి లోపల ద్రవం చేరి ఇన్ఫెక్షన్, చీము లేదా వినికిడి సమస్యలకు దారితీయవచ్చు. ఈ పరిస్థితిలో చెవుల్లో రింగింగ్ శబ్దం (Tinnitus), మైకం లేదా తాత్కాలిక చెవుడు రావచ్చు. ముక్కు పొడిబారడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ధూళి, పొగ, కాలుష్యంకు ఎక్కువ సమయం గురికావడం, శీతాకాలం లేదా వేసవిలో తేమ లోపం, అలర్జీలు, దీర్ఘకాలిక మందుల వాడకం, వృద్ధాప్యం లేదా శరీరంలో ద్రవాలు లేకపోవడం (Dehydration). అలాగే మధుమేహం లేదా ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా ఈ సమస్యను మరింత పెంచవచ్చు.
ఇది కూడా చదవండి: కంది, పెసర, శనగ, మినుములు.. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పు ఏంటో తెలుసా..?
ముక్కులో తేమను కాపాడుకోవడానికి ఆవిరి పీల్చడం (Steam inhalation), సెలైన్ ఉపయోగించడం, రోజంతా ఎక్కువ నీరు తాగడం చాలా అవసరం. ముక్కులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా అణు తైలం (Anu oil) లేదా షడ్బిందు తైలం (Shadbindu oil) వంటి ఆయుర్వేద నూనెలను రోజుకు రెండు చుక్కలు ముక్కులో వేయడం వలన తేమను నిలుపుకోవచ్చు, అలర్జీలను నివారించవచ్చు. వినికిడి సమస్య లేదా చెవుల్లో నిరంతర నొప్పికి పొడి ముక్కు కారణమైతే.. వెంటనే ENT స్పెషలిస్ట్ని సంప్రదించాలి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే.. ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. నివారణ చర్యలతో ఈ పరిస్థితిని సులభంగా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మధుమేహమే కాదు.. ఈ మూడు వ్యాధులు మీ జ్ఞాపకశక్తిని తినేస్తాయి తెలుసా..?