Healthy Habits: రోజుకో పుస్తక పఠనం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం

పుస్తకాలు చదవడం అనేది మెదడుకు ఒక వ్యాయామం వంటిది. మనం చదివేటప్పుడు మెదడు చురుకుగా మారి అనేక ఆలోచనలు, వాస్తవాలు, కొత్త అంశాలను ప్రాసెస్ చేస్తుంది. క్రమం తప్పకుండా పుస్తకాలు చదివితే మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
book read

book read

నేటి డిజిటల్ యుగంలో పుస్తకాలు చదివే అలవాటు తగ్గుముఖం పడుతోంది. అయితే ప్రతిరోజూ కేవలం ఒక గంట పుస్తక పఠనం వలన జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి, నిద్ర కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పుస్తకాలు కేవలం జ్ఞాన నిధులు మాత్రమే కాదు. అవి మన మానసిక ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావం చూపుతాయి. ప్రతిరోజూ పుస్తకం చదివితే ఏమవుతుంది..? దానివల్లన కలిగే ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

జ్ఞాపకశక్తి కంప్యూటర్ వలె పదునుగా..

హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. పుస్తకాలు చదవడం అనేది మెదడుకు ఒక వ్యాయామం వంటిది. మనం చదివేటప్పుడు మెదడు చురుకుగా మారి అనేక ఆలోచనలు, వాస్తవాలు, కొత్త అంశాలను ప్రాసెస్ చేస్తుంది. క్రమం తప్పకుండా పుస్తకాలు చదవడం వలన మెదడు పనితీరు మెరుగుపడి, మానసిక వశ్యత (Mental Flexibility) పెరుగుతుందని పరిశోధనలు నిరూపించాయి. రోజూ చదవడం వలన జ్ఞాపకశక్తి కంప్యూటర్ వలె పదునుగా మారుతుంది. ఒక కథ లేదా నవల చదివినప్పుడు.. అందులోని పాత్రల దృక్పథం నుంచి ఆలోచిస్తారు. ఇది మనలో సానుభూతి (Empathy) సామర్థ్యాన్ని పెంచుతుంది. పఠనం ఇతరుల భావాలు, కష్టాలు, అనుభవాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా సామాజిక సంబంధాలు మెరుగుపడి.. ఇతరులను సున్నితత్వంతో చూసే గుణం పెరుగుతుంది. అంతేకాక.. నిత్యం చదవడం వలన పదజాలం, భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి, రచన మెరుగవుతుంది.

ఇది కూడా చదవండి: శిక్షించకుండా ఇలా సరిదిద్దండి.. పిల్లలను పెంచడంలో అసలు రహస్యాలు ఇవే!!

ప్రతిరోజూ పుస్తకాలు చదవడం వలన నిద్ర, ఒత్తిడి రెండూ మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు పుస్తకం చదివే అలవాటు ఒత్తిడిని తగ్గించి.. మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. మొబైల్ ఫోన్ లేదా టీవీ స్క్రీన్‌లకు బదులుగా పుస్తకం చదవడం వలన మనస్సు ప్రశాంతపడి.. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. చదవడం అనేది శరీరం, మనస్సు రెండింటినీ విశ్రాంతినిచ్చే ఒక ప్రశాంతమైన కార్యకలాపం. అనేక అధ్యయనాలు రోజూ పుస్తకాలు చదివే వ్యక్తులు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉందని చూపించాయి. పుస్తక పఠనం కేవలం మానసికంగా చురుకుగా ఉంచడమే కాక.. జీవితానికి సానుకూల దిశను కూడా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అందమైన మెరిసే చర్మం కోసం అచ్చంగా 6 చిట్కాలు

Advertisment
తాజా కథనాలు