Fatigue: అలసట దూరం.. మెరుగైన ఆరోగ్యం కోసం ఉందిగా ఆయుర్వేద ఉపాయం

నేటి కాలంలో కొద్దిసేపు పనిచేసినాఒంట్లో శక్తి లేనట్లుగా అనిపిస్తోంది. దీనికి కారణం కడుపులోని జఠరాగ్ని బలహీనంగా ఉండటం, మలబద్ధకం వంటి సమస్యల వల్ల విషపదార్థాలు పేరుకుపోయి, రక్తహీనత లేదా కండరాల బలహీనత కూడా అలసటకు కారణమవుతుంది.

New Update
Fatigue

Fatigue

ఆధునిక జీవనశైలిలో చాలామంది తరచూ అలసట, నీరసంతో బాధపడుతున్నారు. కొద్దిసేపు పనిచేసినా, కూర్చున్నా లేదా నిలబడ్డా ఒంట్లో శక్తి లేనట్లుగా అనిపిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం.. ఈ అకస్మాత్తుగా వచ్చే బలహీనత కేవలం చిన్న సమస్య కాదు. ఇది శరీరంలో ఏర్పడిన అసమతుల్యతకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నిరంతరం అలసట ఉంటే.. దానికి కారణం మరియు చికిత్స ఆయుర్వేదంలో ఏం చెబుతున్నారో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

అలసటను తరిమి కొట్టే చిట్కాలు:

ఆయుర్వేదంలో దీనికి ముఖ్యంగా రెండు కారణాలను చెబుతారు. మొదటిది జీర్ణశక్తి బలహీనతగా ఉండటం. కడుపులోని జీర్ణక్రియ (జఠరాగ్ని) బలహీనంగా ఉంటే.. ఆహారం నుంచి శరీరానికి తగిన పోషకాలు అందవు. 2వది విషపదార్థాల సంచయం.  మలబద్ధకం వంటి సమస్యల వల్ల విషపదార్థాలు పేరుకుపోయి, శరీరంలోని శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. రక్తహీనత లేదా కండరాల బలహీనత కూడా అలసటకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. శక్తిని తిరిగి పొందడానికి ఆయుర్వేదం కొన్ని అద్భుతమైన మార్గాలను సూచిస్తోంది. అశ్వగంధను పాలతో తీసుకుంటే శక్తి, జీవశక్తి పెరుగుతాయి. మహిళలకు శతావరి ఎంతో మేలు చేస్తుంది. 

ఇది కూడా చదవండి: టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్!!

రాత్రి పడుకునే ముందు పసుపు, ఆవు నెయ్యితో పాలు తాగడం మంచిది. సూర్య నమస్కారాలు జీర్ణశక్తిని, శరీర శక్తిని పెంచుతాయి. అనులోమ-విలోమ, భ్రమరీ ప్రాణాయామం మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో తేనె-నిమ్మరసం నీరు, సొంటి-బెల్లం కషాయం, తిప్పతీగ రసం బలహీనతను తగ్గిస్తాయి. చల్లని నీళ్లు, నిల్వ ఉంచిన ఆహారం, తరచుగా టీ, కాఫీ తాగడం, పగలు నిద్రించడం, రాత్రి ఆలస్యంగా నిద్రించడం వంటివి అలసటను పెంచుతాయి. అలసటను ఎప్పుడూ విస్మరించవద్దు. ఇది తీవ్రమైన వ్యాధికి తొలి సంకేతం కావచ్చు. సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో పాటు మందులను ఉపయోగించడం ద్వారా శరీర శక్తిని తిరిగి పొందవచ్చని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి:  ముల్లంగి ఆకులు పడేస్తున్నారా..? అయితే ఈ బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాల్సిందే!!

Advertisment
తాజా కథనాలు