/rtv/media/media_files/2025/10/14/herbal-life-2025-10-14-10-15-59.jpg)
Herbal Life
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులు పెరుగుతుండడంతో.. ప్రజలు ఉపశమనం కోసం సంప్రదాయ పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం అనేది ఒత్తిడి, అనారోగ్యాన్ని నివారించడానికి ఒక మెరుగైన పరిష్కారాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలలంటే ఆయుర్వేద పద్ధతిని ఎలా ప్రయత్నించాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఆరోగ్యానికి కొత్త దారి..
నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఆయుర్వేదం కేవలం వ్యాధిని అణచివేయడంపై కాకుండా.. దాని మూలకారణంపై దృష్టి పెడుతుంది. ఇది సమగ్ర ఆరోగ్యం, నివారణ, శారీరక సమతుల్యతపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందంటున్నారు. వాత, పిత్త, కఫ అనే మానవ స్వభావం యొక్క అవగాహన ఆధారంగా ఆహారం, ప్రవర్తన, దినచర్యను పాటించాలని ఆయుర్వేదం నొక్కి చెబుతుంది. ఈ పద్ధతి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా తీవ్రమైన అనారోగ్యాలను నివారిస్తుంది. వ్యాధి నివారణకు శరీరాన్ని శుభ్రపరచడం (Detoxification) చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారా..? దాని ప్రభావం మీ మూత్ర పిండాలపై పడుతుంది జాగ్రత్త!!
ఇది ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడానికి, శరీర సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. జీవనశైలి, ఆహారం విషయంలో.. ఆయుర్వేదం రుతువుల ప్రకారం.. ఆహారం తీసుకోవాలని.. సరైన సమయానికి భోజనం చేయాలని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి తగినంత నిద్ర పొందాలని సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన, సమతుల్య జీవనం కోసం ఆయుర్వేద మార్గాన్ని అనుసరించడం నేటి తరానికి అత్యుత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: శరీరానికి పొటాషియం అందాలంటే ఈ ఆహారం కచ్చితంగా తినాలి