Bathua Leafy: బతువా ఆకులు.. తెలుసుకోండి అవి చేసే మేలు

బతువాలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది. గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు భారంగా అనిపించే వారికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. ఇది పేగు కదలికలను నియంత్రించి, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.

New Update
bathua leafy

Bathua Leafy

శీతాకాలం ప్రారంభం కాగానే.. కూరగాయల మార్కెట్లో ఆకుకూరలు సందడి చేస్తాయి. వాటిలో బతువా (Bathua) ఆకుకూరది ఒక ప్రత్యేక స్థానం. చూడటానికి ఇది సాధారణంగా కనిపించినా.. ఆరోగ్య ప్రయోజనాల విషయంలో ఇది ఒక సూపర్ ఫుడ్ కంటే తక్కువ కాదు. అమ్మమ్మల కాలం నాటి నుంచి నేటి వరకు చలికాలంలో ప్రతి ఇంటి భోజనంలో బతువా కూర, పరాటా లేదా రోటీ ప్రధానంగా ఉంటాయి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా.. శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఇది శరీరాన్ని శుభ్రపరిచే ఒక సహజ డిటాక్స్ (Natural Detox) గా వర్ణించబడింది. బతువా ఆకుకూర వలన నయమయ్యే వ్యాధులు, దాని ప్రభావాలు మరియు ఎవరు దీనిని తినకూడదో అనే దానికిపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

బతువా తినడం వలన..

బతువాలో విటమిన్ A, విటమిన్ C, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది. గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు భారంగా అనిపించే వారికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా బతువాలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను నియంత్రించి, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. ప్రతిరోజూ బతువా తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. బతువా రక్తాన్ని శుద్ధి చేసి చర్మానికి మెరుపునిస్తుంది. మొటిమలు, దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలపై దీని ప్రభావం త్వరగా కనిపిస్తుంది. బతువా రసం తాగడం వల్ల కాలేయం బలోపేతం అవుతుంది, శరీరం నుంచి విషపదార్థాలను (Toxins) బయటకు పంపుతుంది. 

ఇది కూడా చదవండి: చలికాలంలో బెల్లమే కదా అని అనుకోకండి.. నువ్వులతో కలుపుకొని తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండి!!

కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ లేదా రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారికి బతువా ప్రయోజనకరంగా ఉంటుంది. శీతాకాలంలో దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. బతువా రోటీ లేదా పరాటా తినడం చలికాలంలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. కొద్దిగా దేశీ నెయ్యితో వేడి వేడి బతువా పరాటా అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా.. శరీరానికి శక్తిని, వెచ్చదనాన్ని అందిస్తుంది. బతువా కొద్దిగా వెచ్చని (mildly warming) స్వభావాన్ని కలిగి ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఆక్సలేట్స్ రాళ్ల సమస్యను పెంచవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా దీనిని అధిక మొత్తంలో తినకుండా ఉండటం లేదా తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ప్రోటీన్ కోసం మాంసం తినాల్సిన పనిలేదు.. ఈ ఐదు ఆహార పదార్థాలు తింటే చాలు!!

Advertisment
తాజా కథనాలు