/rtv/media/media_files/2025/11/11/jaggery-and-white-sesame-seeds-2025-11-11-07-22-24.jpg)
jaggery and white sesame seeds
చలికాలం ప్రారంభం కాగానే ఆహారంలో మార్పులు చేసుకోవడం సహజం. ఈ సీజన్‌లో ఇష్టంగా తినే ఆహారాలలో నువ్వులు (Sesame Seeds) మరియు బెల్లం (Jaggery) ముఖ్యమైనవి. వీటి రుచి చాలా మందికి నచ్చుతుంది. అయితే ఈ కలయిక రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో నువ్వులు, బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే రోజుకు ఎంత బెల్లం తినాలి మరియు ఎప్పుడు తినాలి అనే విషయాలను నిపుణులు ఏం చెబుతున్నారో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
నువ్వులు, బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
డైటీషియన్ నిపుణులు అందించిన వివరాల ప్రకారం.. చలికాలంలో ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం సహజ కార్బోహైడ్రేట్‌కు మూలం ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. నువ్వులలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ శరీరాన్ని ఎక్కువసేపు చురుకుగా ఉంచుతాయి. చలిలో పెరిగే బద్ధకాన్ని తగ్గించడానికి వీటిని రోజూ తీసుకోవచ్చు. నువ్వులలో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి. బెల్లంలో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్ హిమోగ్లోబిన్‌ను పెంచి.. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు వీటిని తినడం మంచిది. అంతేకాకుండా బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ లేదా మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. నువ్వులలోని ఫైబర్ కూడా పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇది కూడా చదవండి: కఫం ఇబ్బంది పెడుతుందా.. దగ్గుతో పరేషాన్ అవుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందండి!!
నువ్వులు మరియు బెల్లం రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో తరచుగా వచ్చే అనారోగ్యాల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. నువ్వుల నూనె మరియు గింజలు చర్మానికి తేమను అందించి.. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. బెల్లంలోని ఖనిజాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, ముఖానికి ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ బెల్లాన్ని రోజుకు సుమారు 20-30 గ్రాములు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడానికి అల్పాహారం (Breakfast) తర్వాత లేదా మధ్యాహ్న భోజనం (Lunch) తర్వాత తీసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ప్రియమైన సతీమణికి... ముద్దు పేర్లు ఎన్నెన్నో!!
Follow Us