Health Tips: ప్రోటీన్ కోసం మాంసం తినాల్సిన పనిలేదు.. ఈ ఐదు ఆహార పదార్థాలు తింటే చాలు!!

ప్రొటీన్ కోసం సాధారణంగా చికెన్, గుడ్లు, మాంసం వంటి తినాలంటారు. శాకాహారులు ఆహారంలో ప్రొటీన్‌ను పెంచాలనుకుంటే మాంసంతో సమానమైన, ఎక్కువ ప్రొటీన్‌ను అందించగల 5 శాకాహారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Vegetarians

Vegetarians

ప్రొటీన్ శరీరానికి చాలా అవసరం. కండరాలు, ఎముకలు, చర్మం, జుట్టు బలంగా ఉండటానికి తగినంత ప్రొటీన్ తీసుకోవడం చాలా కీలకం. అయితే ప్రొటీన్ లోపం అలసట, బలహీనత, జుట్టు రాలడం, చర్మ సమస్యలకు దారితీయవచ్చు. ప్రొటీన్ కోసం సాధారణంగా చికెన్, గుడ్లు, మాంసం వంటి వాటిని ఎక్కువగా సిఫార్సు చేస్తారు. కానీ శాకాహారులు (Vegetarians) ఏమి తినాలనే సమస్యను ఎదుర్కొంటారు. మీరు శాకాహారులైతే ఆహారంలో ప్రొటీన్‌ను పెంచాలనుకుంటే మాంసంతో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ప్రొటీన్‌ను అందించగల 5 శాకాహారాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: రసాయన జుట్టు రంగులను టాటా చెప్పండి.. ఇంటి వద్దనే ఆరోగ్యకరమైన జుట్టు రంగును తయారు చేసుకోండి!!

అత్యధిక ప్రొటీన్ గల శాకాహారాలు:

  • మొలకెత్తిన పెసలు (Sprouted Moong Dal) చికెన్ లేదా గుడ్లు తినకపోయినా.. ప్రొటీన్ తీసుకోవడం పెంచాలనుకుంటే.. మొలకెత్తిన పెసలను ప్రయత్నించవచ్చు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. 100 గ్రాముల మొలకెత్తిన పెసలలో 7 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. వీటిని తినడం వలన జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
  • టోఫు (Tofu) శరీరానికి అత్యంత ప్రయోజనకరంగా పని చెస్తుంది. ఇది ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంతోపాటు బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. 100 గ్రాముల టోఫులో సుమారు 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. శాకాహారులు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.
  • గ్రీక్ యోగర్ట్ (Greek Yogurt) కడుపు సమస్యల నుంచి ఉపశమనం అందించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రొటీన్‌కు అద్భుతమైన మూలం కూడా. 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్‌లో 10 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.
  • తక్కువ కొవ్వు పనీర్ (Low Fat Paneer) 100 గ్రాముల తక్కువ కొవ్వు పనీర్‌లో ఏకంగా 18 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎముకలు బలంగా మారి.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది. శాకాహారులు దీనిని ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవచ్చు.
  • టెంపే (Tempeh) అనేది సోయాబీన్స్‌తో తయారు చేసే ఇండోనేషియా ఆహార పదార్థం. 100 గ్రాముల టెంపేలో సుమారు 19 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీరంలో ప్రొటీన్‌ను పెంచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి శాకాహారులైన కూడా మాంసంతో సమానంగా ప్రొటీన్‌ను అందించే ఈ ఐదు ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చల్లగా ఉందని నెత్తిన టోపీ పెట్టుకొని పడుకుంటున్నారా..? అలా పడుకుంటే ఏమవుతుందో తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు