/rtv/media/media_files/2025/12/12/toilet-2025-12-12-17-36-26.jpg)
toilet
మలవిసర్జన అనేది శరీరంలో జరిగే ఒక అత్యంత సహజమైన, ముఖ్యమైన ప్రక్రియ. ఇది సరిగా జరిగితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చాలామంది వాష్‌రూమ్‌లో తెలియకుండానే కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు. ఈ చిన్నచిన్న అలవాట్లే కాలక్రమేణా పెద్ద ఆరోగ్య సమస్యలకు, ముఖ్యంగా జీర్ణకోశ సంబంధిత, ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీస్తాయి. జీర్ణకోశ నిపుణులు ఈ అలవాట్ల గురించి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో 7 ముఖ్యమైన సలహాలను ఇస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెంటనే మానుకోవాల్సిన 7 బాత్రూమ్ అలవాట్లు.. వాటిని సరిచేసే పద్ధతుల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
వెనుక నుంచి ముందు వైపు తుడవడం:
చాలామంది ముఖ్యంగా మహిళలు టాయిలెట్ పేపర్‌ను ఉపయోగించి వెనుక నుంచి ముందు వైపుకు తుడవడం చేస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. దీనివల్ల మలంలోని బ్యాక్టీరియా సులభంగా మూత్ర నాళం (Urinary Tract) వైపు చేరి.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. సరైన పద్ధతి ఏమిటంటే.. ఎప్పుడూ ముందు నుంచి వెనుక వైపుకు మాత్రమే తుడవాలి. ఇది బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుంది.
​
వెట్ వైప్స్-సుగంధభరిత వైప్స్ వాడటం:
క్లీనింగ్ కోసం చాలామంది సువాసనగల వెట్ వైప్స్‌ను ఉపయోగిస్తారు. ఇవి పూర్తిగా శుభ్రం చేస్తాయని భావిస్తారు.
కానీ ఈ వైప్స్‌లో ఉండే రసాయనాలు (Chemicals) సున్నితమైన చర్మానికి చికాకు కలిగించి లేదా డెర్మటైటిస్‌కు (చర్మ వాపు) దారితీయవచ్చు. అంతేకాకుండా ఇవి పర్యావరణానికి కూడా మంచివి కావు. డాక్టర్ల సలహా ప్రకారం.. వెట్ వైప్స్‌కు బదులుగా బిడెట్ (Bidet)లేదా సాధారణ నీటిని ఉపయోగించి శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
3 రోజులకు మించి మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేయడం:
మలబద్ధకం (Constipation) సమస్య ఉన్నా.. అది వాటంతట అవే తగ్గుతాయని భావించి మూడు రోజులకు మించి వేచి ఉండటం. ఇంత ఎక్కువ కాలం మలబద్ధకం ఉంటే మలం గట్టిపడి విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రెక్టల్ ప్రాంతంలో గాయం కలిగే అవకాశం ఉంది. ఇది పైల్స్ (Piles) లేదా ఫిషర్‌లకు దారితీయవచ్చు. అయితే మూడు రోజులు దాటినా మీ ప్రేగులు శుభ్రం కాకపోతే.. సొంత చిట్కాలు వాడకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.
కూర్చునే భంగిమ:
వెస్ట్రన్ టాయిలెట్స్‌పై పూర్తిగా కూర్చునే భంగిమలో ఉండటం. సాధారణంగా కూర్చున్నప్పుడు రెక్టమ్ (Rectum) సరిగా నిటారుగా ఉండదు (Squatting Position). దీనివల్ల మలం సులభంగా బయటకు రాదు మరియు అధిక ఒత్తిడి (Straining)అవసరం అవుతుంది. ఇది కూడా పైల్స్ ఏర్పడటానికి ఒక కారణమవుతుంది. అందుకని మల విసర్జన చేసే సమయంలో మీ పాదాల కింద ఒక చిన్న స్టూల్ లేదా ఫుట్‌రెస్ట్‌ను పెట్టుకోవడం మంచిది. ఇది మీ శరీర భంగిమను కొద్దిగా స్క్వాట్ పొజిషన్‌కు మారుస్తుంది.. ప్రేగు కదలిక సులభం అవుతుంది.
ఇది కూడా చదవండి: హల్దీ సమయంలో మొహానికి పసుపు ఎందుకు పూస్తారో తెలుసా?.. 99% మందికి ఈ విషయం తెలియదు!
టాయిలెట్‌లో ఫోన్ స్క్రోల్:
​టాయిలెట్‌లో కూర్చుని మొబైల్ ఫోన్ (Scrolling on the Phone)చూస్తూ ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. దీనివల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మలద్వారం ప్రాంతంలో అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా రక్తం గడ్డకట్టి పైల్స్ లేదా హేమోరాయిడ్స్ వచ్చే ప్రమాదం అధికమవుతుంది. అందుకే టాయిలెట్‌లో ఫోన్ వాడకాన్ని తప్పనిసరిగా నివారించాలి. మీ పని ముగియగానే వెంటనే బయటకు వచ్చేయాలి.
ఫోన్ శుభ్రం:
టాయిలెట్‌లోకి ఫోన్ తీసుకువెళ్లినా, ఆ తర్వాత దాన్ని శుభ్రం (Not Cleaning Your Phone)
చేయకపోవడం కూడా డేంజర్ అని అంటున్నారు. వాష్‌రూమ్‌లో ఉండే అనేక క్రిములు, బ్యాక్టీరియా ఫోన్ ఉపరితలంపై సులభంగా అంటుకుంటాయి. ఆ ఫోన్‌ను మళ్లీ పట్టుకున్నప్పుడు.. ఆ క్రిములు శరీరంలోకి చేరి వ్యాధులను వ్యాప్తి చేసే మాధ్యమంగా మారుతుంది. టాయిలెట్ తర్వాత ఫోన్‌ను తప్పకుండా ఆల్కహాల్ బేస్డ్ వైప్స్ లేదా శానిటైజర్‌తో శుభ్రం చేయాలి.
​మూత మూయకుండా ఫ్లష్:
​మలవిసర్జన తర్వాత టాయిలెట్ సీట్ మూత (Lid) తెరచి ఉంచి ఫ్లష్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. మూత తెరచి ఉన్నప్పుడు ఫ్లష్ చేసినప్పుడు.. నీటి తుంపరలు (Micro-droplets) శక్తివంతంగా గాలిలోకి వ్యాపిస్తాయి. ఈ తుంపరలలో టాయిలెట్‌లోని బ్యాక్టీరియా ఉంటుంది. అది టూత్‌బ్రష్, టవల్ లేదా ఇతర వస్తువులపై చేరే అవకాశం ఉంది. అందుకని పరిశుభ్రత కోసం ఎప్పుడూ ఫ్లష్ చేసే ముందు సీట్ మూతను తప్పకుండా మూయాలి. ఈ చిన్నచిన్న అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యంపై చాలా పెద్ద సానుకూల ప్రభావం ఉంటుంది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సూచించిన ఈ 7 విషయాలను గుర్తుంచుకుని.. వాటిని దైనందిన జీవితంలో అమలు చేయడం ద్వారా అనేక అనవసరమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కోడిగుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?
Follow Us