Hair Dye: రసాయన జుట్టు రంగులను టాటా చెప్పండి.. ఇంటి వద్దనే ఆరోగ్యకరమైన జుట్టు రంగును తయారు చేసుకోండి!!

నేటికాలంలో ఒత్తిడి, ఆందోళన, ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. మార్కెట్‌లో లభించే రసాయన హెయిర్ డై వల్ల త్వరగా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇంట్లోనే సహజమైన హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
_Hair Dye

Hair Dye:

నేటి కాలంలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం అనేది పెద్ద సమస్యగా మారింది. దీనికి ప్రధాన కారణాలుగా ఒత్తిడి, ఆందోళన, సరిగా లేని జీవనశైలి, ఆహారపు అలవాట్లని చెబుతు ఉంటారు . ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయన హెయిర్ డైలను ఉపయోగిస్తున్నారు. అయితే.. వాటిలోని రసాయనాల కారణంగా త్వరగా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అంతేకాకుండా అధిక వినియోగం తలలో దురద, చుండ్రు వంటి సమస్యలను కూడా పెంచవచ్చు. ఈ పరిస్థితుల్లో తెల్ల జుట్టుకు ఇంట్లోనే చేసుకునే కొన్ని సహజ నివారణలు (Home Remedies) చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. జుట్టు చాలా త్వరగా తెల్లబడుతున్నట్లయితే... పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే ఇంట్లోనే సహజమైన హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఇంట్లోనే సహజ హెయిర్ డై తయారీ:

ఇది ఇంట్లో సులభంగా లభించే పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తుంది, జుట్టుకు పూర్తిగా సురక్షితమైనది. ఈ తయారీలో ముఖ్యంగా ఉసిరి (Amla)ని ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు అత్యంత ప్రయోజనకరంగా పరిగణించబడే పుల్లని పదార్థం. సహజ హెయిర్ డై తయారీకి ఉసిరి పొడి (Amla Powder), గోరింటాకు పొడి (Henna Powder), కాఫీ పొడి (Coffee Powder), పెరుగు (Yogurt), బ్లాక్ టీ (Black Tea), కొబ్బరి నూనె (Coconut Oil) ఈ వన్ని కావలసినవి రెడీగా పెట్టుకోవాలి. ఈ సహజ డైని తయారు చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో 2 టీస్పూన్ల ఉసిరి పొడి. 1 టీస్పూన్ కాఫీ పొడి, 2 టీస్పూన్ల గోరింటాకు పొడిని తీసుకోవాలి. ఒక పాత్రలో టీ ఆకుల నీటిని తయారుచేసుకోవాలి. ఈ నీటిని పౌడర్ మిశ్రమంలో పోసి.. మెల్లగా కలుపుతూ ఉండాలి. ఆ తరువాత పెరుగు, కొబ్బరి నూనెను కలిపి చిక్కని పేస్ట్‌లా తయారుసుకోవాలి. 

ఇది కూడా చదవండి: పరగడుపున జీలకర్ర నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే!!

గోరింటాకు రంగు బాగా ముదురుగా మారడానికి ఈ పేస్ట్‌ను 2 నుంచి 3 గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సహజ హెయిర్ డై సిద్ధమవుతుంది. దీన్ని అప్లై చేయడానికి.. ముందుగా జుట్టును కొద్దిగా తడి చేయాలి. ఈ డైని తల నుంచి జుట్టు చివర్ల వరకు పూర్తిగా అప్లై చేసి 2 గంటల పాటు ఉంచాలి. ఆపై నీటితో తల స్నానం చేయాలి. ఇది తెల్ల జుట్టును వేర్ల నుంచి నల్లగా కనిపించేలా చేస్తుంది. ఉసిరి ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి చాలా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా.. జుట్టును వేర్ల నుంచి నల్లబరచడంలో కూడా సహాయపడుతుంది. ఇకపై మార్కెట్‌లో లభించే రసాయన-ఆధారిత హెయిర్ డైలకు గుడ్ బై చెప్పి.. ఇంట్లో తయారు చేసిన ఈ సహజ హెయిర్ డైని ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: సర్ది అయిన పిల్లలు అరటిపండ్లు తినొచ్చా!! వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు