Health Tips: జుట్టులో చెమట కంపు ఇలా వదిలించుకోండి

ఆరోగ్యకరమైన జుట్టు మరియు తాజాగా ఉండే తల కోసం సరైన సంరక్షణ చాలా అవసరం. యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం, ఉల్లిపాయ రసం, టీ ట్రీ ఆయిల్, కలబంద జెల్ వాడితే జుట్టును శుభ్రంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Bad smell in hair due to sweat

Bad smell in hair

నేటి కాలంలో దుమ్ము, ధూళి, అధిక చెమట, సూర్యరశ్మి మరియు తలలోని జిడ్డు కారణంగా చాలామంది దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు. ఈ వాసన వల్ల నలుగురిలో నిలబడాలన్నా, బహిరంగ ప్రదేశాల్లో తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జుట్టు మరియు తాజాగా ఉండే తల కోసం సరైన సంరక్షణ చాలా అవసరం. ఎప్పటికప్పుడు జుట్టును శుభ్రంగా కడగడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. చెమట వాసనతో బాధపడేవారు తప్పక పాటించాల్సిన కొన్ని అద్భుతమైన సహజ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 5 మార్గాలు దాన్ని వదిలించుకోవడానికి సహాయపడతాయి. వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

సహజ పద్ధతులు:

  • యాపిల్ సైడర్ వెనిగర్: జుట్టు నుంచి చెమట వాసనను తొలగించడానికి యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. ఇది దుర్వాసనకే కాకుండా చుండ్రు మరియు తలలో దురద వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
  • నిమ్మరసం:మార్కెట్లో లభించే రసాయన ఉత్పత్తులు తాత్కాలికంగా ఉపశమనం అందించినప్పటికీ.. శాశ్వత పరిష్కారం కోసం నిమ్మరసం వంటి సహజ పద్ధతులను పాటించడం మంచిది. నిమ్మరసాన్ని జుట్టుకు అప్లై చేయడం ద్వారా దుర్వాసనను సులభంగా వదిలించుకోవచ్చు.
  • కలబంద జెల్: కలబంద జెల్‌ను వారానికి రెండు లేదా మూడు సార్లు జుట్టుకు రాసుకుంటే చెమట వాసన సులువుగా తొలగిపోతుంది.
  • ఉల్లిపాయ రసం:జుట్టు ఆరోగ్యానికి ఉల్లిపాయ రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. ఇది జుట్టు నుండి చెడు వాసనను తొలగించడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించి, వెంట్రుకల పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.
  • టీ ట్రీ ఆయిల్:టీ ట్రీ ఆయిల్‌ను జుట్టుకు రాసి మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ జుట్టుకు మరియు తలకు కూడా చాలా మేలు చేస్తుంది. జిడ్డు, దుమ్ము మరియు చెమట కారణంగా వచ్చే దుర్వాసనను తగ్గించడానికి ఈ సహజ పద్ధతులను మీ సంరక్షణలో భాగం చేసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: కళ్ళు మసకబారుతున్నాయా?.. పట్టించుకోకుండా ఉంటే కల్లుపోతాయి!!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: టాన్ వదులుతుంది.. ముఖం మెరుస్తుంది.. ఎలానో తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు