Health Issues: డేంజర్.. నీరు తాగిన వెంటనే టాయిలెట్ వస్తుందా.. మీకు ఈ సమస్యలు ఉన్నట్లే!

వాటర్ తాగిన వెంటనే టాయిలెట్ వస్తుంటే డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్య ఉన్నవారికి కూడా  పదే పదే టాయిలెట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీరితో పాటు డయాబెటిస్ ఉన్నవారికి కూడా మూత్రం వస్తుందని నిపుణులు అంటున్నారు.

New Update
drinking water

drinking water

ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా డైలీ బాడీకి సరిపడా వాటర్(drinking-water) తీసుకోవాలి. అయితే అవసరానికి మించి అధికంగా నీరు తాగితే ఎక్స్‌ట్రా వాటర్‌ను మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది. సాధారణంగా టాయిలెట్ రావడం వేరే.. వాటర్ తాగిన వెంటనే టాయిలెట్ రావడం వేరే అని నిపుణులు అంటున్నారు. ఎవరికైతే ఎక్కువగా వాటర్ తాగిన వెంటనే టాయిలెట్ వస్తుందో వారి శరీరంలో ఏదైనా అసమతుల్యతకు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వాటర్ తాగిన వెంటనే టాయిలెట్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు ఏంటి? దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో? ఈ స్టోరీలో చూద్దాం. 

ఈ సమస్యలు ఉన్నట్లే..

కొందరు వాటర్‌తో పాటు కొన్ని పానీయాలు, టీ, కాఫీ వంటివి తీసుకుంటారు. వీటిలో ఉండే కెఫిన్ కారణంగా మూత్ర ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది. దీంతో పదే పదే టాయిలెట్ వెళ్లాలనే ఆలోచన వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్య ఉన్నవారికి కూడా  పదే పదే టాయిలెట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాడర్ కండరాలు ఎక్కువగా సున్నితంగా మారినప్పుడు, మూత్రం కొద్దిగా ఏర్పడిన వెంటనే టాయిలెట్‌కి వెళ్లాలని అనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే, మూత్ర నియంత్రణ సమస్యగా మారే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా మూత్రం రావడం అనేది డయాబెటిస్ ముఖ్య లక్షణాలలో ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం ఆ అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. దీనివల్ల మూత్రం పరిమాణం పెరుగుతుంది. దీనితో పాటుగా ఎక్కువ దాహం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.

 ఇది కూడా చదవండి: ఎక్కువ కాలం బతకాలని ఉందా..? అయితే.. వెంటనే ఈ 10 అలవాట్లు మార్చుకోండి!!

మహిళల్లో కనిపించే సమస్య యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (UTI). బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం, దుర్వాసన, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే, కిడ్నీ స్టోన్ (మూత్రపిండాలలో రాళ్లు) కూడా తరచుగా మూత్రం రావడానికి ఒక కారణంగా ఉండవచ్చు. మూత్రం రంగు ముదురుగా మారడం, కడుపు దిగువ భాగంలో నొప్పి, మూత్రం పోసిన తర్వాత కూడా ఉపశమనం లేకపోవడం వంటివి కిడ్నీ స్టోన్ లక్షణాలుగా గుర్తించాలి. అయితే ఈ సమస్యను తగ్గించడానికి ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు తాగకుండా రోజుకు 1.5–2 లీటర్ల పరిధిలో కొద్దికొద్దిగా తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. టీ, కాఫీ, ఆల్కహాల్, పులుపు పండ్లను పరిమితంగా తీసుకోవాలి. కీగల్ వ్యాయామాలు చేయడం వల్ల పెల్విక్ కండరాలు బలంగా మారుతాయి. తద్వారా మూత్ర నియంత్రణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మూత్రం వచ్చిన వెంటనే టాయిలెట్‌కి వెళ్లకుండా కొంత సమయం ఆగేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల బ్లాడర్ సామర్థ్యం పెరుగుతుందని అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు