వేసవిలో వీటిని తాగితే.. వేడి సమస్యలన్నీ క్లియర్

వేసవిలో పచ్చి మామడి జ్యూస్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటే బాడీకి చలవ చేస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీంతో పాటు ముఖంపై ఉండే మచ్చలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Green mango juice

Green mango juice

వేసవిలో ఎంత చల్లని డ్రింక్‌లు తీసుకున్నా కూడా బాడీ వేడిగా ఉంటుంది. అయితే వేసవిలో బాడీ చల్లగా ఉండాలంటే సాఫ్ట్ డ్రింక్‌లు వంటివి కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవాలి. వీటివల్ల బాడీకి చలవ చేయడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మరి ఆ పానీయాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి:Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!

పచ్చి మామిడి జ్యూస్

పచ్చి మామిడి కాయలతో తయారు చేసిన జ్యూస్‌ తాగితే వేసవిలో బాడీకి చలవ చేస్తుంది. ఈ జ్యూస్‌ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. పచ్చి మామిడిని ఉడికించి జ్యూస్ చేసుకోవాలి. ఇందులో పుదీనా, కాల్చిన జీలకర్ర, నల్ల ఉప్పు, బెల్లం, పంచదార ఇలా మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్

కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లను డైరెక్ట్‌గా కాకుండా అందులోని గుజ్జు తీసి మిక్సీ చేసి జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల బాడీకి చలవ చేస్తుంది. అలాగే చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలను కూడా తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. 

ఇది కూడా చూడండి:Indo-Pak tension: పాకిస్థాన్‌పై దాడి లాంఛనమే.. IAF చీఫ్‌తో ప్రధాని మోదీ

మజ్జిగ 
వేసవిలో ఇంట్లోనే మజ్జిగ చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. బాడీకి చలవ చేస్తుంది. అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. అయితే ఇందులో జీలకర్ర, పెరుగు, నల్ల ఉప్పు వంటివి కూడా వేసుకోవచ్చు. 

నిమ్మరసం
నిమ్మరసం, పుదీనా, తేనె, కాస్త ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల వేసవిలో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే బాడీ కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. నిమ్మరసంలో పంచదార లేకుండా తాగితే బరువు కూడా ఈజీగా తగ్గుతారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు