Drugs Prices: షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్‌ మెడిసిన్ ధరలు

ప్రభుత్వ నియంత్రణలోని డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు వాడే ఔషదాల ధరలు పెరగనున్నాయి. వీటిలో క్యాన్సర్‌, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతోసహా ఇతర వ్యాధులకు సంబంధించిన యాంటీబయాటిక్స్‌ కూడా ఉన్నాయి. వీటి ధరలు 1.7 శాతం పెరిగే అవకాశం ఉంది.

New Update
medicen

medicen Photograph: (medicen)

ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మందుల ధరలు త్వరలో పెరగనున్నాయి. డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులకు వాడే ఔషదాల ధరలు పెరగనున్నాయని ప్రభుత్వవ వర్గాలు బుధవారం వెల్లడించాయి. వీటిలో క్యాన్సర్‌, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతోసహా ఇతర వ్యాధులకు సంబంధించిన యాంటీబయాటిక్స్‌ కూడా ఉన్నాయి. వీటి ధరలు 1.7 శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్‌ ప్రైసెస్‌(కంట్రోల్‌) ఆర్డర్‌(డీపీసీఓ), 2013 ప్రకారం ఫార్మసీ డ్రగ్స్‌కు ధరలపై గరిష్ఠ పరిమితి ఉంటుంది. తయారీ సంస్థలు ఈ ధరకు మించి ఉత్పత్తులను అమ్మరాదు.

Also Read :  వీకెండ్ వినోదం.. ఉగాది బాక్సాఫీస్ హీరో ఎవరు..?

Also Read :  IPL స్పెషల్.. క్రికెట్ లవర్స్‌‌ కోసం RTC, మెట్రో గు‌డ్ న్యూస్

Diabetes  - Cancer Drugs Prices Hikes

Also read: RAW: అమెరికాలో RWA పై ఆంక్షలు..!

మందుల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాల ధరలు, ఇతర ఖర్చులు పెరుగుతున్న కారణంగా మందుల ధరల పెంపు ఫార్మసీ పరిశ్రమకు ఉపశమనం కలిగించగలదని అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టు సంఘం(ఏఐఓసీడీ) ప్రధాన కార్యదర్శి రాజవీ సింఘాల్‌ తెలిపారు. కాగా, ఫార్మా కంపెనీలు అనుమతించిన ధరల పెంపు కన్నా అధికంగా మందుల ధరలు పెంచుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని రసాయనాలు, ఎరువుల అధ్యయనంపై ఏర్పడిన పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది.

Also Read :  పాస్టర్ ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో చంపేశారు.. ఇదిగో ప్రూఫ్స్.. షర్మిల సంచలన ప్రకటన!

 

indian-government | latest-telugu-news | today-news-in-telugu | daily-life-style | human-life-style

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు