Weekend Movies: ఈ వారాంతం ఉగాది, రంజాన్ వేడుకలతో పాటు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ సిద్ధంగా ఉంది. లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు ఈ వారం అదిరిపోయే సినిమాలు సందడి చేయనున్నాయి. ఏకంగా నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ పోటీకి సిద్ధమయ్యాయి. కోలీవుడ్ స్టార్ మోహన్ లాల్ 'లూసిఫర్ 2', నితిన్ 'రాబిన్హుడ్' యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' వీకెండ్ వినోదాన్ని అందించనున్నాయి. మరి వీటిలో బాక్స్ ఆఫీస్ హీరో అయ్యేదెవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
వీకెండ్ వినోదం..
రాబిన్హుడ్, మ్యాడ్ స్క్వేర్'
మార్చి 28న నితిన్ ' రాబిన్హుడ్', 'మ్యాడ్ స్క్వేర్' పోటీపడనున్నాయి. ఈ రెండు చిత్రాల మంచి ప్రమోషనల్ కంటెంట్ తో గట్టిగానే బజ్ క్రియేట్ చేశాయి. క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాకతో ' రాబిన్హుడ్' హైప్ మరింత పెరిగింది.
మరోవైపు 'మ్యాడ్ స్క్వేర్' కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పటికే ఇండియా, USAలో ఈ సినిమాకు మంచి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. తాజాగా 'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్ విడుదల చేయగా.. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో నవ్వులు పూయించింది. అంతేకాదు పార్ట్ 1 సూపర్ హాట్ కావడంతో పార్ట్ 2 పై అంచనాలు బాగా పెరిగాయి.
సికందర్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన సికందర్ మార్చి 30 అంటే ఆదివారం విడుదల కానుంది. అయితే ఈ సినిమా సౌత్ కంటే నార్త్ బెల్ట్ లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.
L2: ఎంపురాన్
వీకెండ్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన L2: ఎంపురాన్ విడుదలతో ప్రారంభమవుతుంది. ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి భారతదేశం, USAలో రికార్డు స్థాయిలో ముందస్తు బుకింగ్స్ జరిగాయి.
telugu-news | latest-news | cinema-news | weekend-movies
Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!