పాస్టర్ ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో చంపేశారు.. ఇదిగో ప్రూఫ్స్.. షర్మిల సంచలన ప్రకటన!

పాస్టర్ ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో హత్య చేశారని వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి సంఘటనా స్థలంలో అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతిపై వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.

New Update

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఆయనది రోడ్డు ప్రమాదం కాదన్నారు. ఇది హత్య అనడానికి సంఘటన స్థలంలో చాలా రుజువులు ఉన్నాయన్నారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతిపై వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు