/rtv/media/media_files/2025/08/25/paneer-modak-2025-08-25-19-29-23.jpg)
Paneer Modak
వినాయక చవితి(Ganesh Chaturthi 2025) పండుగ వస్తుందంటే చాలు గణపయ్యకు ఎంతో ఇష్టమైన మోదకాలు గుర్తుకొస్తాయి. రకరకాల మోదకాలు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అలాంటి వాటిలో రుచికరమైన, సులభంగా తయారు చేసుకోగలిగిన మలై మోదక్ లేదా పనీర్ మోదక్ ఒకటి. కేవలం రెండు ముఖ్యమైన పదార్థాలతో.. 15 నిమిషాల్లో ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ప్రసాదం సిద్ధం చేయాల్సిన వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వినాయక చవితికి ప్రత్యేకమైన ఈ వంటకం గురించి కొన్ని విషయాల ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తక్కువ సమయంలో సులభంగా తయారీ విధానం:
పనీర్, కండెన్స్‌డ్ మిల్క్ మిశ్రమం:ఒక పాన్ తీసుకొని అందులో పనీర్ తురుము, కండెన్స్‌డ్ మిల్క్ మరియు కుంకుమపువ్వు వేయాలి.
వండటం: ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై వెడి చేస్తూ బాగా కలపాలి. పనీర్ ముద్దలను స్పూన్ వెనుక భాగంతో నొక్కుతూ మెత్తగా చేసుకోవాలి. మిశ్రమం దగ్గరపడి ముద్దలా మారేంతవరకు సుమారు 7-8 నిమిషాలు ఉడికించాలి. ఈ దశలో అది పాన్ నుంచి సులభంగా విడిపోతుంది.
ముద్దలా చేయడం:ఉడికిన మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని.. కొంచెం చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో ముద్దలా మెత్తగా కలపాలి.
ఆకృతి: మోదక్ మౌల్డ్ (అచ్చు) ను నెయ్యితో రాయాలి. ముద్దను మౌల్డ్‌లో గట్టిగా నొక్కి.. కింద ఉన్న రంధ్రం ద్వారా నింపాలి. అచ్చును జాగ్రత్తగా తెరచి.. మోదక్‌ను బయటకు తీయాలి. ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో మోదక్‌లను తయారు చేయాలి. ఒకవేళ మోదక్ అచ్చు లేకపోతే.. చేతితో లడ్డూలుగా కూడా చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: వినాయక చవితి నాడు ఎవరు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో మీకు తెలుసా?
చిట్కాలు:
కుంకుమపువ్వు: మలై మోదక్(Malai Modak Prasadam) కు తెల్లటి రంగు రావాలంటే కుంకుమపువ్వు వేయాల్సిన అవసరం లేదు. కేసరి మోదక్‌లు కావాలంటే.. కొద్దిగా గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు వేసి నానబెట్టి ఆ తర్వాత ఈ మిశ్రమంలో కలపవచ్చు. అయితే రెడీమేడ్ పనీర్ ఉపయోగిస్తే.. దానిని గోరు వెచ్చని నీటిలో 10-15 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత తురుముకోవాలి. ఇంట్లో తయారు చేసిన పనీర్ అయితే.. నీరు లేకుండా పూర్తిగా పిండి ఉపయోగించాలి. పనీర్‌లో ఉండే తేమ ఆధారంగా వండే సమయం కొద్దిగా మారవచ్చు. ఈ వినాయక చవితి పండుగకు పనీర్ మోదక్ ఇంకా ప్రత్యేకంగా తయారు చేసుకోవచ్చు. ఒకవేల తీపి వంటకం కావాలంటే పనీర్, పంచదార, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు.దీనికోసం ముందుగా పనీర్‌ను మెత్తగా చేసి దానిలో పంచదార కలిపి స్టవ్‌పై ఉడికించాలి. తర్వాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి చల్లార్చాలి. ఆ మిశ్రమాన్ని మోదక్ ఆకారంలో తయారు చేసి పైన పిస్తా లేదా బాదం ముక్కలతో అలంకరిస్తారు. ఈ మోదక్ తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. గణేష్ చతుర్థి వేడుకలకు అతి తక్కువ సమయంలోనే ఈ రుచికరమైన పనీర్ మోదక్‌లతో గణపయ్యను సంతోషపెట్టండి.
ఇది కూడా చదవండి: ఎల్లుండే వినాయక చవితి.. మీ ఇంట్లో ఈ 3 పనులు ఇప్పుడే ప్రారంభించండి!