Vinayaka chavithi 2025: వినాయక చవితి నాడు ఎవరు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో మీకు తెలుసా?

వినాయక చవితి నాడు పసుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న దుస్తులు ధరించాలని పండితులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగుల్లో ఉన్న దుస్తులు ధరించకూడదని అంటున్నారు. వీటివల్ల అంతా అశుభం జరుగుతుందని చెబుతున్నారు.

New Update
Vinayaka Chavithi 2025

Vinayaka Chavithi 2025

హిందూ పండుగల్లో వినాయక చవితి (vinayaka chavithi 2025) కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిజానికి పండుగలన్నింటిలో మొదటిగా జరుపుకునే పండుగ ఇదే. ఈ పండుగ తర్వాతే మిగతా పండుగలు వరుసగా వస్తాయి. వినాయకుడి పుట్టిన రోజుగా ఈ వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే వినాయకుడిని విఘ్నాలకు అధిపతిగా, శుభకార్యాలకు మూలకర్తగా భావిస్తారు. అందుకే ఏ కార్యం మొదలుపెట్టాలన్నా ముందుగా గణపతిని పూజిస్తారు. అయితే ప్రతీ ఏడాది భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన వినాయక చవితిని నిర్వహిస్తారు. అయితే ఈ వినాయక చవితి నాడు ఎవరు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: Vinayaka Chavithi 2025: 500 ఏళ్ల తర్వాత ప్రత్యేకమైన వినాయక చవితి.. ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్ట యోగం!

పసుపు రంగు

పసుపు రంగును హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైన రంగుగా భావిస్తారు. ఇది శుభానికి, జ్ఞానానికి, శ్రేయస్సుకు చిహ్నం. వినాయక చవితి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే గణపతిని పసుపుతో చేస్తారు. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయని పండితులు చెబుతున్నారు. 

ఎరుపు రంగు

ఎరుపు రంగు శక్తికి, సాహసానికి, శుభానికి చిహ్నం. ఇది లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన రంగు. ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల శక్తి, ఆనందం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే వినాయక చవితి నాడు ఏదైనా పని చేపడితే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని నమ్ముతారు.

ఆకుపచ్చ రంగు

ఆకుపచ్చ రంగు ప్రకృతికి, సంపదకు, సౌభాగ్యానికి ప్రతీక. పండుగల సమయంలో ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల సానుకూల శక్తి, మంచి ఆరోగ్యం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఆకుపచ్చ రంగు విజయానికి ప్రతీకగా నమ్ముతారు. 

గోల్డ్ రంగు

బంగారం రంగు దుస్తులు ధరించడం వల్ల సంపద, ఐశ్వర్యం, విజయం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. వినాయక చవితి రోజున ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తారు.

తెలుపు రంగు

తెలుపు రంగు స్వచ్ఛతకు, శాంతికి, పరిశుభ్రతకు చిహ్నం. పండుగ రోజున తెలుపు దుస్తులు ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటుందని నమ్ముతారు.

ధరించకూడని రంగులు

సాధారణంగా హిందూ సంప్రదాయంలో పండుగ రోజుల్లో నలుపు రంగు దుస్తులు ధరించడం అశుభంగా భావిస్తారు. నలుపు రంగును దుఃఖం, అశుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి వినాయక చవితితో పాటు ఏ పండుగ రోజున కూడా నలుపు రంగు దుస్తులు ధరించకపోవడం మంచిది.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి:Ganesh Chaturthi 2025: గణపతిని ప్రతిష్టించేటప్పుడు ఈ వాస్తు తప్పులు చేస్తే దరిద్రం !

Advertisment
తాజా కథనాలు