Vinayaka chavithi 2025: గణేషుడిని మండపానికి ఇలా తీసుకురండి.. తప్పక పాటించాల్సిన జాగ్రత్తలివే!

మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు గణేష్ ఉత్సవ నిర్వాహకులకు జాగ్రత్తలతో కూడిన పలు కీలక సూచనలు చేశారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

New Update
Ganesh

Vinayaka chavithi 2025:   మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.  విభిన్న రూపాల్లో వినాయక విగ్రహాలు మండపాల్లో కొలువుదీరడానికి సిద్ధమవుతున్నాయి. ఊరు, వాడ, పిల్లా, పెద్ద అందరూ ఏకమై సంబురంగా జరుపుకునే  పండగ వినాయకచవితి.  ఇప్పటికే  చాలా చోట్ల నిర్వాహకులు గణపయ్య రాక కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల  మండపాలు నిర్మించడం పూర్తవగా.. గణేష్ విగ్రహాలు కూడా చేరుకున్నాయి. 

9 రోజుల పాటు వినాయకుడి ఉత్సవాలతో నగరమంతా కోలాహలంగా మారుతుంది. అయితే కొన్ని సార్లు  అనుకోని అపశృతులు కూడా చోటుచేసుకుంటుంటాయి. ముఖ్యంగా విగ్రహాలను మండపానికి తరలించేటప్పుడు, నిమజ్జనం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఇటీవలే  పంజాగుట్టలో గణేషుడిని విగ్రహాన్ని మండపానికి తీసుకొస్తున్న లారీ  ఫ్లైఓవర్ కింద  ఇరుక్కుపోయింది. విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండడంతో లారీ బయటకు రాలేకపోయింది.  దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు గణేష్ ఉత్సవ నిర్వాహకులకు జాగ్రత్తలతో కూడిన పలు కీలక సూచనలు చేశారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

మండపానికి తరలించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  • ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో విగ్రహాలను తరలించవద్దని సూచించారు. దీనివల్ల రోడ్లపై మరింత రద్దీ ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.  కావున రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో విగ్రహాలను తరలించాలని చెప్పారు. 
  • భారీ ఎత్తు కారణంగా కొన్ని సందర్భాల్లో విగ్రహాలు ఫ్లై ఓవర్ల కింద ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఈ సమస్యను నివారించడానికి విగ్రహం ఎత్తును బట్టి ముందుగానే రూట్ ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. 
  • అలాగే నిపుణులైన డ్రైవర్లను ఎంచుకోవాలని సూచించారు. చిన్న వాహనాల్లో భారీ విగ్రహాలు తరలించొద్దు తెలిపారు. 
  • చిన్నారులను విగ్రహాల తరలింపు కోసం తీసుకెళ్లొద్దని, విద్యుత్ వైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 
  • భారీ విగ్రహాలు వాహనంలో పెట్టడానికి క్రేన్ సహాయం తీసుకోవాలని చెప్పారు. 

ఇదిలా ఉంటే నిమజ్జనం సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఊరేగింపు చేసే సమయంలో కొందరు  విగ్రహాన్ని తరలించే వాహనం పై ఎక్కడం చేస్తుంటారు. ఈ సమయంలో విద్యుత్  తీగలు తగిలి ప్రమాదం జరిగే  ఛాన్స్ ఉంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా! 

Also Read: Ganesh Chaturthi 2025: గణపతిని ప్రతిష్టించేటప్పుడు ఈ వాస్తు తప్పులు చేస్తే దరిద్రం !

Advertisment
తాజా కథనాలు