/rtv/media/media_files/2025/08/26/ganesh-chaturthi-2025-2025-08-26-13-16-12.jpg)
Ganesh Chaturthi 2025
వినాయక చవితి(Ganesh Chaturthi 2025) అనేది వినాయకుడిని పూజించే హిందువుల ముఖ్యమైన పండుగ. ఇది వినాయకుడి జన్మదినంగా భావిస్తారు. భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. వినాయకుడిని తొలి పూజలందుకునే దేవుడిగా భావిస్తారు. అందుకే ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. వినాయక చవితి రోజున వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. కొబ్బరికాయలు, పూలు, పత్రి, పండ్లతో స్వామివారిని అలంకరిస్తారు. ఈ రోజున రకరకాల ప్రసాదాలు, వంటకాలు తయారు చేస్తారు. ముఖ్యంగా కుడుములు, ఉండ్రాళ్లు వినాయకుడికి ఎంతో ఇష్టం. పూజ తర్వాత ఈ ప్రసాదాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఈ పండుగను దేశం నలుమూలలా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఇంట్లో ఏ రంగు గణపతి విగ్రహాన్ని పెట్టాలని కొందరూ అలోచిస్తారు. ఈ పండుగకు ఇంట్లో ఏం రంగు గణపతిని పెట్టలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
సింధూరం రంగు గణపతి విగ్రహాన్ని..
వినాయక చవితి సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఇంటింటా బప్పా కొలువుదీరనున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఏ రంగు గణపతిని ప్రతిష్ఠిస్తే శుభం కలుగుతుందో అని కొందరికి మనస్సులో ఉంటుంది. కొత్తగా ఏ పని మొదలుపెట్టినా, కొత్త ఇంట్లోకి ప్రవేశించినా, వినాయక చవితి పండుగైనా వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠాపన చాలా ముఖ్యమైనది. వినాయక చవితి పండుగ రోజున, శుభం, సంతోషం, శ్రేయస్సు, లాభం, తెలివితేటల దేవుడైన గణపతి అనుగ్రహం పొందడానికి ఇంట్లో సింధూరం లేదా తెలుపు రంగు గణపతిని ప్రతిష్ఠించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.. వాస్తు శాస్త్రం ప్రకారం.. సహజమైన రాయి లేదా మట్టితో చేసిన గణపతి విగ్రహాలు ఏ ఇంటికైనా శుభప్రదం. ఇంటిలో తెల్లని గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అత్యంత శుభప్రదంగా చెబుతారు. దీని ప్రభావంతో మంచి శక్తి, సామరస్యం, సంతోషం, శ్రేయస్సు, విజయం లభిస్తాయని చెబుతారు.
ఇది కూడా చదవండి: ఎల్లుండే వినాయక చవితి.. మీ ఇంట్లో ఈ 3 పనులు ఇప్పుడే ప్రారంభించండి!
సింధూరం రంగు గణపతి విగ్రహాన్ని ఆత్మవికాసం కోసం కృషి చేసే వ్యక్తులు ప్రతిష్ఠించాలని సూచిస్తారు. దీనివల్ల అన్ని పనులు సఫలమవుతాయి. ఇంకా అసంపూర్ణమైన కోరికలు త్వరగా నెరవేరుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటిలో ఒకే గణపతి విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఇంట్లో అదనపు విగ్రహాలను ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వినాయక చవితి రోజున గణపతిని మధ్యాహ్నం పూట ప్రతిష్టించాలి. కలశం కూడా స్థాపించాలి. పసుపు రంగు వస్త్రాన్ని చెక్క పీటపై వేసి దానిపై విగ్రహాన్ని ఉంచాలి. పగటిపూట జల ఆహారం లేదా పండ్లను మాత్రమే తినాలి. సాయంత్రం గణేశుడిని పూజించి నెయ్యి దీపం వెలిగించాలి. ఈ జాగ్రత్తలతో వినాయకుడి అనుగ్రహం పొందవచ్చు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: గణపయ్యకు నైవేద్యం.. కేవలం 15 నిమిషాల్లో!