Lungs: ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉత్తమ పండ్లు ఇవే

కాలుష్యం, ధూమపానం, వ్యాయామ లోపం వంటి కారణాలతో ఊపిరితిత్తుల పనితీరు తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంది. నారింజ, దానిమ్మ, పుచ్చకాయ, బొప్పాయి, అనాస, మామిడి పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

New Update

Lungs: మన శరీరంలో ప్రతి భాగం సమర్థవంతంగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరం. ముఖ్యంగా ఊపిరితిత్తులు. ఇవి శ్వాసక్రియకు మూలం కావడంతో వాటి ఆరోగ్యం ఎంతో కీలకం. కాలుష్యం, ధూమపానం, చెత్త ఆహారపు అలవాట్లు, వ్యాయామ లోపం వంటి కారణాలతో ఊపిరితిత్తుల పనితీరు తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా వీటి రక్షణ చాలా అవసరం. ఈ క్రమంలో పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన ఊపిరితిత్తులను శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అనాస పండులో బ్రోమెలైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్‌ను కలిగి ఉండటంతో శ్వాసనాళాలలో ఏర్పడే వాపును తగ్గిస్తుంది.

శరీరాన్ని చల్లబరచడంలో..

ఇది శ్వాసకోశ వ్యాధులలో ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా కలిగి ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని తినడం ద్వారా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కివి కూడా శ్వాస వ్యవస్థకు మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ సి ఊపిరితిత్తుల కణాల రక్షణకు సహాయపడతాయి. స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి ఊపిరితిత్తుల కణజాలాలను బలోపేతం చేస్తాయి. వేసవి కాలంలో ఎక్కువగా తినే పుచ్చకాయ శరీరాన్ని చల్లబరచడంలో పాటు ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి: గంధం రాసుకుంటే కలిగే ప్రయోజనాలు

ఇందులోని లైకోపీన్, విటమిన్ సి వంటి పోషకాలు శ్వాసకోశాలను బలపరుస్తాయి. అలాగే మామిడి పండులో ఉన్న బీటా కెరోటిన్, విటమిన్ ఎ, సి ఊపిరితిత్తులను ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా చేస్తాయి. ఇది శ్వాసనాళాలను శుభ్రపరచడంలో కూడా తోడ్పడుతుంది. దానిమ్మ పండు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ వంటి ముఖ్యమైన పోషకాలతో ఊపిరితిత్తులకు రక్షణ కవచంగా మారుతుంది. ఇవి హానికర వాయువుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. నారింజలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఈ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇప్పటికే ఉన్న శ్వాస సంబంధిత సమస్యల కోసం తగిన వైద్య సలహా తీసుకోవడం మరచిపోవద్దు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చిన్న పిల్లలకు వెండి నగలు పెట్టడానికి కారణం ఏమిటి?

( healthy-lungs | lungs-health-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు