/rtv/media/media_files/2025/04/20/UMwieO0q5GTH8gltGAlo.jpg)
Silver Jewelry
Silver Jewelry: పిల్లలు పుట్టినప్పటి నుంచే వారికి వెండి ఆభరణాలు ధరించే సంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో ఉంది. ఊయల వేడుకల నుండి నామకరణం వరకు చిన్నారుల చేతులు, కాళ్లు, నడుము, మెడలపై వెండి నగలే ప్రధానంగా కనిపిస్తాయి. ఇది కేవలం అందం కోసం మాత్రమే కాదు దీని వెనుక ఒక లోతైన శాస్త్రీయ కారణం కూడా ఉంది. వెండికి సహజంగా ఉన్న ఔషధ గుణాలు శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. వెండిలో సహజంగా శీతల లక్షణాలుండటం వల్ల వేసవిలో చిన్నారుల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
చిన్నపిల్లలకు వ్యాధులను దూరంగా..
వేడి వాతావరణంలో పిల్లలు వేడిని తట్టుకోలేని స్థితిలో ఉండగా వెండి నగలు శరీరాన్ని చల్లబరిచి వారిని ప్రశాంతంగా ఉంచుతాయి. ఇదే సమయంలో వెండికి ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని హానికరమైన సూక్ష్మక్రిముల నుంచి రక్షించడంతో పాటు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇది చిన్నపిల్లలకు వ్యాధులను దూరంగా ఉంచేలా సహాయపడుతుంది. ఆడుకుంటూ చిన్నపిల్లలు చిన్న గాయాల బారిన పడటం సర్వసాధారణం. వెండి ఆభరణాలు అలాంటి గాయాలకు త్వరగా మానేలా చేయడంలో సహకరిస్తాయని నమ్మకం ఉంది. చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాదు వెండి రక్త ప్రసరణను మెరుగుపరచే లక్షణాలను కలిగి ఉండటంతో పిల్లల శరీర అభివృద్ధికి ఇది సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: లావుగా ఉన్నవారికి ఈ 16 వ్యాధులు రావడం ఖాయం
కొంత మంది వెండి నగలను చెడు దృష్టి లేదా దుష్ట శక్తుల నుంచి రక్షణగా కూడా భావిస్తారు. ఇది భౌతిక ప్రయోజనాలతో పాటు మానసిక స్థాయిలో పిల్లలకు భద్రత కలిగిస్తుందని నమ్ముతారు. వెండికి మానసిక శాంతిని కలిగించే లక్షణాలు కూడా ఉండటం వల్ల ఇది పిల్లలకు హాయిగా నిద్రపోడానికి సహాయపడుతుంది. ఈ సంప్రదాయం శాస్త్రీయంగా ప్రామాణికత కలిగినదే కాకుండా ఆరోగ్యపరంగా చిన్నారులకు ఒక రకంగా రక్షణ కవచంగా మారుతుంది. అయితే వెండి నగాల ఎంపికలో పిల్లల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అవసరమైతే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వేసవిలో బొప్పాయి ఎక్కువగా తినడం హానికరమా?
( health-tips | health tips in telugu | latest health tips | latest-news)