/rtv/media/media_files/2025/05/05/Y14BbTM6icaEM37zSRVb.jpg)
Fenugreek seeds water
మెంతి గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా బరువు నియంత్రణలో ఉంటుందని చాలా మంది తాగుతారు. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు మెంతి గింజల వాటర్ తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. మరి ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీసుకోకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!
రక్తపోటు
అధిక రక్తపోటు ఉన్నవారు మెంతి గింజల వాటర్‌ను తాగడం వల్ల సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. దీనివల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు అలసట, నీరసం అన్ని సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్
గర్భిణులు
మెంతి గింజల వాటర్‌ను గర్భిణులు అసలు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. గర్భధారణ సమయంలో జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే వీటి నుంచి విముక్తి చెందడానికి తక్కువగా తీసుకోవాలి. అది కూడా వైద్యుల సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Indo-Pak tension: పాకిస్థాన్‌పై దాడి లాంఛనమే.. IAF చీఫ్‌తో ప్రధాని మోదీ
రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు
రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు మెంతి గింజల వాటర్‌ను తక్కువగా తీసుకోవాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి తక్కువగా మెంతి వాటర్‌ను తీసుకోవడం ఉత్తమం.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Follow Us