/rtv/media/media_files/2025/09/08/cancer-2025-09-08-20-38-15.jpg)
Cancer
కొందరికి రాత్రిపూట నిద్ర మధ్యలో బాత్రూమ్(wash room) కు లేచే అలవాటు ఉంటుంది. మరికొందరు మాత్రం పడుకుంటే మధ్యలో లేవరు. అయితే పురుషులు ఎవరైతే ఎక్కువగా మధ్యరాత్రిలో మూత్ర విసర్జనకు వెళ్తుంటారో వారికి క్యాన్సర్(Cancer) వచ్చినట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రోస్టేట్‌లో మార్పులు రావడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా ఇలా వెళ్తుంటే మాత్రం ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Body Damage: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే మీ బాడీ మొత్తం డ్యామేజ్ అయినట్లే!
ప్రోస్టేట్ అనేది మూత్రాశయం క్రింద ఉన్న ఒక చిన్న గ్రంథి. ప్రధానంగా శరీరం నుంచి మూత్రాన్ని బయటకు పంపే గొట్టం అయిన మూత్రనాళం చుట్టూ ఉంటుంది. అయితే ప్రోస్టేట్‌లో చిన్న మార్పులు కూడా మనిషి మూత్రం విసర్జించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ గ్రంథి తరచుగా వయస్సుతో పాటు పెరుగుతుంది. దీనివల్ల మూత్రనాళాన్ని ఇరుకుగా చేస్తుంది. దీనివల్ల స్రావం బలహీనత, సంకోచం, వడకట్టడం లేదా రాత్రిపూట లేవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రోస్టేటిస్‌తో సహా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్లు మూత్రవిసర్జన సమయంలో నొప్పికి కారణం అవుతాయి. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్(prostate-cancer) మూత్ర మార్పులకు కారణం అవుతుంది. ఈ ప్రోస్టేట్ లక్షణాలు కొన్ని కనిపించవు. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతుంటాయి. మొదటి దశలో కాకుండా చివరి దశలో లక్షణాలను చూపిస్తుంది. దీనివల్ల మూత్రంలో లేదా వీర్యంలో రక్తం, ఎముక నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
మూత్ర విసర్జన ప్రారంభించడంలో కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. వీటితో పాటు మూత్ర విసర్జన చేయడానికి కష్టపడటం లేదా తర్వాత బ్లడ్ కారడం, రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి అనేకసార్లు మేల్కొనడం, బాధాకరమైన మూత్రవిసర్జన లేదా కటి నొప్పి, మూత్రంలో రక్తం లేదా వీర్యంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు అంటున్నారు. అయితే లక్షణాలు కనిపిస్తే సాయంత్రం సమయాల్లో కెఫిన్, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పడుకునే ముందు మూత్ర విసర్జన చేయడానికి ప్రయత్నించాలి. అన్నింటికంటే ముఖ్యంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. డైలీ వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. వీటివల్ల కండరాలు, ఎముకలు బలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య తీవ్రంగా ఉంటే ట్రాన్స్‌యురెత్రల్ రిసెక్షన్ ఆఫ్ ది ప్రోస్టేట్ లేదా లేజర్ ప్రోస్టేటెక్టమీ వంటి శస్త్రచికిత్సల నుంచి ఈ సమస్యకు దీర్ఘకాలిక ఉపశమనాన్ని అందిస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో, మూత్ర నియంత్రణ, లైంగిక పనితీరును కాపాడటం లక్ష్యంగా క్యాన్సర్‌ను తొలగించడానికి ఓపెన్, లాపరోస్కోపిక్ లేదా రోబోటిక్ సర్జరీ ద్వారా రాడికల్ ప్రోస్టేటెక్టమీ (ప్రోస్టేట్ తొలగింపు) అవసరం అవుతుంది.
ఇది కూడా చూడండి: Betel Leaves Benefits: భోజనం తిన్న తర్వాత ఈ ఆకు నమిలితే.. ఏం జరుగుతుందో తెలుసా?
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.