Body Damage: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. అయితే మీ బాడీ మొత్తం డ్యామేజ్ అయినట్లే!

ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా కడుపు నొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటివి వస్తుంటాయి. అయితే ఎప్పుడో ఒకసారి పర్లేదు. కానీ ఎక్కువగా ఇవే సమస్యలు వస్తుంటే మాత్రం పూర్తిగా మీ ఆరోగ్యం క్షీణించినట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Health issues

Health issues

కొందరికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా కడుపు నొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటివి వస్తుంటాయి. అయితే ఎప్పుడో ఒకసారి పర్లేదు. కానీ ఎక్కువగా ఇవే సమస్యలు వస్తుంటే మాత్రం పూర్తిగా మీ ఆరోగ్యం క్షీణించినట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే బాడీ డ్యామేజ్ అయినట్లు తెలియజేసే కొన్ని లక్షణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఈ లక్షణాలు కనిపిస్తే..

శరీరానికి నష్టం జరిగినప్పుడు వెంటనే కనిపించే లక్షణాలు సాధారణంగా బయటి నుండి కనిపిస్తాయి ముఖ్యంగా గాయాలు, వాపు, చర్మం రంగు మారినట్లు కనిపిస్తే  మాత్రం అనారోగ్యం వచ్చినట్లు గుర్తించాల్సిందే. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు చర్మంపై కోతలు, గీతలు, లేదా లోతైన గాయాలు ఏర్పడతాయి. ఈ ప్రాంతంలో ఎరుపు రంగు లేదా వాపు కనిపిస్తుంది. దీనివల్ల కణజాలం లేదా కండరాలకు నష్టం జరిగిందని గుర్తించాలి. అలాగే ఎముకలు విరిగినప్పుడు లేదా కీళ్లు బెణికినప్పుడు కూడా తీవ్రమైన నొప్పి, వాపు, కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు దెబ్బ తగిలిన చోట రక్తం గడ్డకట్టి, చర్మం నీలం, ఊదా లేదా నలుపు రంగులోకి మారుతుంది. ఇది అంతర్గతంగా రక్తస్రావం జరిగిందని సూచిస్తుంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అలసటగా అనిపిస్తే..

కొన్ని లక్షణాలు బయటికి కనిపించకుండా కొన్ని సంకేతాలు తెలియజేస్తాయి. ముఖ్యంగా నొప్పి ద్వారా తెలుస్తుంది. దీర్ఘకాలిక తలనొప్పి, కడుపు నొప్పి లేదా ఏదైనా ఒక శరీర భాగంలో నొప్పి ఉంటే, అది ఏదో ఒక సమస్య ఉందని సూచిస్తుంది. అలాగే కండరాలు లేదా నరాలకు నష్టం జరిగితే, శరీర భాగాలలో బలహీనత పెరుగుతుంది. దీనివల్ల పనులు చేయడంలో ఇబ్బందులు లేదా నడకలో అస్థిరత వంటివి ఏర్పడవచ్చు. శారీరక నష్టం జరిగినప్పుడు శరీరం దాన్ని సరిచేయడానికి చాలా శక్తిని ఉపయోగిస్తుంది. దీనివల్ల అలసట, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. నొప్పి లేదా అసౌకర్యం వల్ల కూడా సరిగా నిద్ర పట్టదు.

నరాలు దెబ్బతినడం వల్ల..

శరీరానికి జరిగిన నష్టం వల్ల కొన్నిసార్లు బాడీలో కొన్ని  పార్ట్‌లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు జీర్ణవ్యవస్థపై ప్రభావం పడితే, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు లేదా ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు లేదా గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఏ కారణం లేకుండా బరువు తగ్గడం అనేది కూడా ఒక తీవ్రమైన అంతర్గత సమస్యకు సంకేతం కావచ్చు. మెదడు లేదా నరాలు దెబ్బతిన్నప్పుడు జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా ఆలోచించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీర్ఘకాలిక శారీరక నష్టం ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. ఈ లక్షణాలన్నీ శరీరంలో ఏదైనా సమస్య ఉన్నట్లే. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు