/rtv/media/media_files/2025/10/09/diwali-2025-2025-10-09-11-26-21.jpg)
Diwali 2025
లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి దీపావళి పండుగ(diwali-festival)ను ఘనంగా జరుపుకుంటారు. అయితే దీపావళి రోజున కొన్ని నియమాలను పాటిస్తే ఇంట్లో సంపద రెట్టింపు అవుతుందని, ఇక కనక వర్షమే అని పండితులు అంటున్నారు. అయితే దీపావళి రోజున ఎలాంటి నియమాలు పాటిస్తే డబ్బు మీ సొంతం అవుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: బియ్యం పిండి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగకరమండి!!
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి
దీపావళి పండుగ రోజున చాలా మంది లక్ష్మీదేవి(sri-mahalakshmi-devi)ని పూజలు చేసి ఆమె అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ముందుగా మన ఇల్లు శుభ్రంగా ఉండాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉన్న చోటే నివసిస్తుంది. అందుకే దీపావళి రోజు ఇంటిని పూర్తిగా ఊడ్చి, కడిగి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలో ఏ మూల కూడా చెత్తాచెదారం, పనికిరాని పాత వస్తువులు పేరుకుపోకుండా జాగ్రత్తపడాలి. చెత్త, దుమ్ము ఉన్న చోట దరిద్రం, అశుభం ఉంటుందని నమ్ముతారు. కాబట్టి,దీపావళికి ముందు నుంచే ఇంటిని శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టండి. ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది.
అలంకరణ
దీపావళిని 'దీపాల పండుగ' అని అంటారు. లక్ష్మీదేవికి వెలుగు అంటే చాలా ఇష్టం. అందుకే పండుగ రోజు ఇంటిని దీపాలు, అలంకరణతో కళకళలాడేలా చూసుకోవాలి. ఇంటిని రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి. ఇలా చేయడం ద్వారా తల్లి లక్ష్మి అనుగ్రహం కలిగి ఆ ఇంట్లోకి సంపద ప్రవేశిస్తుంది. చీకటి, అంధకారం ఉన్న చోటుకు లక్ష్మీదేవి రాదు. ఈ రోజున చాలా మంది ఒకే దీపం వెలిగించి పూజ చేస్తారు. అయితే అలా చేయకూడదు. ఎక్కువ దీపాలతో ఆ ఇళ్లు కళకళలాడుతూ ఉండాలని పండితులు తెలిపారు.
ఈశాన్యంలో దీపం
ఈశాన్యంలో దీపం వెలిగించడం వల్ల సంపద, డబ్బు వస్తాయని పండితులు అంటున్నారు. దీపావళి రోజు ఇంటి ఈశాన్య మూలలో తప్పకుండా ఒక దీపం వెలిగించడం చాలా మంచిది. ఈశాన్య దిక్కును దైవ స్థానంగా భావిస్తారు. ఈ దిశలో వెలుగు ఉంటే, ఇంట్లో ధనాకర్షణ బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఇది ఆర్థికంగా కలిసి రావడానికి, వ్యాపారం బాగా వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పండితులు అంటున్నారు.
కొనాల్సిన వస్తువులు
దీపావళి రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేసి, పూజలో ఉంచుకోవడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుందని పండితులు అంటున్నారు. దీపావళి రోజున లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా బంగారం, వెండి నాణాలను కొనుగోలు చేసి పూజలో ఉంచితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులను కొనడం వల్ల ఇంట్లో సంపద నిలకడగా ఉంటుందని నమ్ముతారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Diwali 2025: దీపావళి ముందు రోజు ఈ 5 వస్తువులు ఇంటికి తెస్తే పట్టిందల్లా బంగారమే!