Diwali 2025: దీపావళి ముందు రోజు ఈ 5 వస్తువులు ఇంటికి తెస్తే పట్టిందల్లా బంగారమే!

హిందూ పంచాంగం ప్రకారం.. దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని ధంతేరాస్‌ అని కూడా అంటారు.   ప్రతీ ఏడాది అశ్విని మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ధన త్రయోదశి అంటారు. ఇది దీపావళి పండగకు నాంది పలుకుతుంది.

New Update
Diwali 2025

Diwali 2025

Diwali 2025:  హిందూ పంచాంగం ప్రకారం.. దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని ధంతేరాస్‌ అని కూడా అంటారు.   ప్రతీ ఏడాది అశ్విని మాసం క్రిష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ధన త్రయోదశి అంటారు. ఇది దీపావళి పండగకు నాంది పలుకుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 18న ధన్‌తేరస్ వచ్చింది. 

హిందూ సంప్రదాయం ప్రకారం.. ధంతేరాస్‌ రోజున సంపద దేవత లక్ష్మీ దేవి, కుబేరుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఇంట్లో అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం వస్తాయని నమ్ముతారు. ధంతేరాస్‌ రోజున తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

ధన యంత్రం లేదా కుబేర యంత్రం

ఈ యంత్రం సంపద మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షించే పవిత్ర జ్యామితీయ చిహ్నం. దీనిని పూజా గదిలో లేదా డబ్బు పెట్టెలో ఉంచితే ఆర్థిక వృద్ధి లభిస్తుందని నమ్ముతారు.

వెండి, ఇత్తడి లేదా రాగి పాత్రలు

ఇత్తడి, వెండి లేదా రాగి పాత్రలు ఇంటికి సానుకూల శక్తిని అందిస్తాయని నమ్ముతారు. ఈ రోజున స్టీల్ లేదా ఇనుము పాత్రలు కొనకూడదని సలహా ఇస్తారు.

లక్ష్మీ-గణేశ విగ్రహాలు

ధన్‌తేరస్ రోజున లక్ష్మీ దేవి, వినాయకుడి విగ్రహాలు లేదా చిత్రాలను కొనుగోలు చేయడం వల్ల  జ్ఞానం,  సంపద కలుగుతాయి. వీటిని పూజా స్థలంలో ప్రతిష్టించడం ద్వారా అదృష్టం కలిసి వచ్చి, ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి.

చీపురు 

ధన్‌తేరస్ రోజున  కొత్త చీపురు కొనడం ఒక ప్రత్యేక సంప్రదాయం. ఇది ఇంట్లో  పేదరికం,  ప్రతికూలతను తొలగిస్తుందని నమ్ముతారు. 

గోమతి చక్రం

గోమతి నదిలో లభించే అరుదైన సహజ సిద్ధమైన ఈ చిప్పలు ఆధ్యాత్మిక, రక్షణకు  ప్రసిద్ధి. దీనిని ఇంట్లో ఉంచుకోవడం ద్వారా విజయం లభిస్తుంది, అడ్డంకులు తొలగుతాయి. అలాగే చెడు దృష్టి నుంచి  కుటుంబాన్ని రక్షిస్తుందని నమ్ముతారు.

కొత్త ఫర్నిచర్, ఇంటి అలంకరణ వస్తువులు 

ధన్‌తేరస్ రోజున కొత్త ఫర్నిచర్, దీపాలు, కర్టెన్లు లేదా గోడ అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడం వలన సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు.

ఆభరణాలు

ధన్‌తేరస్ బంగారం, వెండి, లేదా వజ్రాల ఆభరణాలు కొనడానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఆభరణాలు కేవలం సంపదకు చిహ్నం మాత్రమే కాదు, కుటుంబానికి భద్రత కూడా. చాలా మంది ఈ రోజున తమ ప్రియమైన వారికి ఆభరణాలు బహుమతిగా ఇస్తారు.

Also Read: Cinema: టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మకు మెగాస్టార్ ఇచ్చిన బహుమతి చూస్తే షాకే!

Advertisment
తాజా కథనాలు