Devi Navaratri 2025: నేటి నుంచే దేవీ నవరాత్రులు.. ఇలా అమ్మవారిని పూజిస్తే.. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం

దేవీ నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. దుర్గాదేవిని పూజించిన తర్వాత లలితా సహస్రనామం పారాయణం చేయాలని అంటున్నారు.

New Update
Durga devi

Durga devi

దేవీ నవరాత్రులు(Devi Navaratri 2025) నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఎంతో భక్తితో దుర్గాదేవిని కొలుస్తారు. అయితే ప్రతీ ఏడాది ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి రోజు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. పాడ్యమి నుంచి దశమి వరకు ప్రతీ రోజూ అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించి పూజిస్తారు. ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. అయితే అమ్మవారిని నేడు ఎలా పూజిస్తే ఫలితం ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం. 

Also Read :  నేటి రాశి ఫలాలు.. రాబోతున్న పెద్ద సమస్య.. ఈ రాశుల వారికి బిగ్ అలర్ట్!

మొదటి రోజు ఇలా పూజిస్తేనే..

నవరాత్రులలో మొదటిరోజు దుర్గాదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజు పూజ చేయడానికి ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని అందంగా అలంకరించాలి. పూజలో ఎరుపు రంగు పూలను ముఖ్యంగా గులాబీ పూలను వాడటం మంచిదని పండితులు  చెబుతున్నారు. అమ్మవారికి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి, అగరుబత్తులు వెలిగించాలి. నవ రాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే దుర్గాదేవిని పూజించిన తర్వాత లలితా సహస్రనామం పారాయణం చేయాలని పండితులు అంటున్నారు. దుర్గాదేవి(durga devi) ని భక్తితో పూజించి అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం (పాయసం) చేయాలి. వీటిని పంచదారతో కాకుండా బెల్లంతో చేయాలని పండితులు అంటున్నారు. ఆ తర్వాత దుర్గాదేవికి కుంకుమతో పూజ చేసి, హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే ఇంట్లోనే సుఖసంతోషాలు, ఐశ్వర్యాలు పెరుగుతాయని పండితులు అంటున్నారు. 

Also Read :  అమేజింగ్.. బొడ్డు కొవ్వును వెన్నలా కరిగించే అద్భుతమైన చిట్కా ఇదే..!

తొమ్మిది రోజులు ఒక్కో అలంకారంలో..

బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారం 
శ్రీ గాయత్రీ దేవి అవతారం
శ్రీ అన్నపూర్ణా దేవి అవతారం
శ్రీ కాత్యాయనీ దేవి అవతారం
శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం
శ్రీ లలితా దేవి అవతారం 
శ్రీ చండీదేవి అవతారం 
శ్రీ సరస్వతి దేవి అవతారం
దుర్గాదేవి అవతారం 
మహిషాసుర మర్ధిని అవతారం 
శ్రీ రాజరాజేశ్వరి అవతారం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు