నూతన సీఎస్‌గా కె.విజయానంద్
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రేసులో సాయిప్రసాద్, విజయానంద్ పేర్లు బలంగా వినిపించాయి. కానీ సీఎం చంద్రబాబు మాత్రం విజయానంద్ నియమకాన్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి రేపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.
కాగా విజయానంద్ ఇప్పుడు ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు పొడిగించిన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో.. ఆయన స్థానంలో విజయానంద్‌ను నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: తండ్రి లేకపోయినా ఫర్వలేదు..మైనర్ కి పాస్‌పోర్టు ఇవ్వొచ్చు!
విజయానంద్‌కు ఎందుకు?
ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్ పేరు గట్టిగా వినిపించింది. కానీ సాయిప్రసాద్‌ను నియమిస్తే ఆయన పదవీకాలం అయ్యేలోగా విజయానంద్ రిటైర్ అవుతారని.. అందువల్లనే ముందుగా విజయానంద్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక వచ్చే ఏడాదిలో అంటే 2025 నవంబర్‌లో విజయానంద్ రిటైర్ అయ్యాక సాయిప్రసాద్‌ను సీఎస్‌గా నియమించే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు మరో 6 నెలల పదవీకాలం పొడిగిస్తే ఆయన కూడా సంవత్సర కాలం పనిచేసినట్లు అవుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: రుతుపవనాల సీజన్ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!
అందువల్లనే వీరిద్దరిలో ఎవరిని ఎక్కువ తక్కువా చూడకుండా.. ఇద్దరికీ ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్ధేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా విజయానంద్ స్వస్థలం కడప జిల్లా. ఈయన 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి.