2024 Top Premium Bikes: ఈ ఏడాది రిలీజ్ అయిన టాప్ ప్రీమియం బైక్స్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్!

2024 ఏడాది మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాదిలో భారతదేశంలో లాంచ్ అయిన ప్రీమియం బైక్‌లు ఇక్కడ ఉన్నాయి. కవాసకి నింజా, కేటీఎం, డుకాటీ హైపర్‌మోటార్డ్, ట్రయంఫ్, డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వంటి ప్రీమియం బైక్‌లు రిలీజ్ అయ్యాయి.

New Update
2024 premium bikes

2024 premium bikes

భారత మార్కెట్‌లో బైక్‌లకు మంచి క్రేజ్ ఉంది. ఎక్కువగా యూత్.. డిఫరెంట్ షేడ్స్ ఉన్న బైక్‌లను ఇష్టపడుతున్నారు. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లు గల బైక్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో ప్రీమియం బైక్‌లకు మంత్రముగ్దులవుతున్నారు. ఈ క్రమంలోనే పలు దిగ్గజ కంపెనీలు సైతం కొత్త కొత్త బైక్‌లను భారతదేశంలో లాంచ్ చేస్తున్నాయి. మరి ఈ ఏడాది 2024లో భారతదేశంలో రిలీజ్ అయిన టాప్ ప్రీమియం బైక్‌లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read: బాక్సింగ్ డే టెస్ట్.. థర్డ్ అంపైర్ కాల్‌పై కమిన్స్ అసహనం!

2024 Kawasaki Ninja ZX-6R

2024 Kawasaki Ninja ZX-6R
2024 Kawasaki Ninja ZX-6R 

కవాసకి తన 2024 ZX-6Rని ఈ ఏడాది ప్రారంభించింది. ఇది ZX-10R ప్రేరేపిత ఫెయిరింగ్ డిజైన్, మరిన్ని టెక్నాలజీ ఫీచర్లతో దేశంలో లాంచ్ అయింది. కంపెనీ దీనిని రూ.11.10 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ZX-6R బైక్ సరైన పనితీరు ఆధారిత పూర్తి-ఫెయిర్డ్ మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ బైక్. చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 

Also Read: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్.. అదనంగా రూ.4000!

KTM 1390 Super Duke R

KTM 1390 Super Duke R
KTM 1390 Super Duke R

KTM బైక్‌లకు యువత ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ KTM 1390 సూపర్ డ్యూక్ Rను 2024 చివరిలో భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో కొత్తదైన అతి పెద్ద 1,350 cc V-ట్విన్ ఇంజన్‌ను అమర్చారు. దీంతో ఈ బైక్ 10 bhp పవర్, 5 Nm గరిష్ట టార్క్‌ను (190 bhp/ 145 Nm) ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ చూడ్డానికి ఆకర్షణీయంగానూ ఎంతో దూకుడుగానూ కనిపిస్తుంది. ఈ బైక్ చాలా ఖరీదైనది. దీని ధరను కంపెనీ రూ.22.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇది ఆరెంజ్ కలర్‌లో వచ్చింది. 

Also Read: యువతి ప్రేమకు బందీలుగా మారిన సింహాలు

Ducati Hypermotard 698 Mono

Ducati Hypermotard 698 Mono
Ducati Hypermotard 698 Mono

డుకాటి హైపర్‌మోటార్డ్ 698 మోనో బైక్ 2024లో భారతదేశంలో లాంచ్ అయిన అత్యంత ప్రీమియం బైక్. అంతేకాకుండా దేశంలోనే అత్యంత ఖరీదైన, శక్తివంతమైనది. ఇది సింగిల్-సిలిండర్ మోటార్‌సైకిల్‌గా అందుబాటులోకి వచ్చింది. కంపెనీ దీని ధరను రూ.16.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇది రేసింగ్ ప్రియులకు చాలా బెటర్ ఆప్షన్. అత్యాధునిక టెక్నాలజీతో వచ్చింది. 659 cc సూపర్‌క్వాడ్రో మోనో ఇంజన్‌ను కలిగి ఉంది. 77.5 bhp పవర్, 63 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

Also Read: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్

Triumph Daytona 660

Triumph Daytona 660
Triumph Daytona 660 

 ట్రయంఫ్ డేటోనా 660 బైక్ భారతదేశంలో రూ.9.72 లక్షల ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇది కొత్త డేటోనా లెజెండరీ నేమ్‌ప్లేట్‌ను యాక్సెస్ చేయగల స్పోర్ట్స్ టూరర్‌గా రూపొందించబడింది. ఈ బైక్ 660cc ట్రిపుల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. అదే సమయంలో 93.7 bhp పవర్, 69 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ చూడ్డానికి ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. రేసింగ్ ప్రియులకు ఎంతగానో ఆకట్టుకుంది. 

Ducati Streetfighter V4

Ducati Streetfighter V4
Ducati Streetfighter V4

 డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వి4 బైక్ 1,103 cc ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది అసాధారణమైన 205 bhp పవర్, 123 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4ని ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్ సహా మరిన్ని అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. విభిన్న రైడ్, పవర్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ బైక్ రూ.24.62 లక్షల ధరతో అందుబాటులో ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు